యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ
యోగా సంగం కార్యక్రమాన్ని నిర్వహించిన పీఐబీ, సీబీసీ కార్యాలయం
సికింద్రాబాద్, జూన్ 17 ( ప్రజామంటలు) :
'వార్త' నిర్వహ యోగా అనేది భారతీయ ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతిబింబించే గొప్ప ఆధ్యాత్మిక పరిచయం అని, ఇది శరీరాన్ని,మనస్సును,శ్వాసను, ఆలోచనలను ఒకే దారిలో ఉంచేలా చేస్తుందని ప్రముఖ యోగా గురువు శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ అన్నారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పత్రికా సమాచార కార్యాలయం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కార్యాలయాలు 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం యోగా అవగాహాన కార్యక్రమం 'యోగా సంగం' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యోగా అనేది మనకు ఆరోగ్యాన్ని,మానసిక ప్రశాంతతను కలిగించే సమగ్ర సాధన పద్ధతి.యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యకర జీవన శైలిని అలవరుచుకోవటం, మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవటం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయంలోని అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించినట్లు పిఐబి , సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ తెలిపారు.మహిళా జర్నలిస్టులు, ఉద్యోగుల కోసం 'హార్మోన్ల నుండి వైద్యం వరకు మహిళల ఆరోగ్యంపై యోగా ప్రభావం' అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం 'వార్త' నిర్వహించారు.
శారీరక, మానసిక శ్రేయస్సుపై దృష్టి సారించిన ఈ సమావేశానికి దాదాపు 50 మంది జర్నలిస్టులు, మహిళా ఉద్యోగులు హాజరయ్యారు. నేచర్ క్యూర్ ఆసుపత్రికి చెందిన వైద్యురాలు డా.వైష్ణవి మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రాణాయామం, ఆసనాలు సహా యోగా పద్ధతులను ప్రదర్శించారు. నాడి శోధన, అనులోమ్ విలోమ్ వంటి శ్వాస పద్ధతుల ద్వారా ఒత్తిడి నుంచి ఏ విధంగా ఉపశమనం కలిగుతుందో వివరంగా తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
