వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రోగుల వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్ల పరిశీలన
సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించారు. ఈసందర్బంగా ఆసుపత్రిలోని పేషంట్లు చికిత్స పొందుతున్న వార్డులు, ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర విభాగాలను కేంద్రమంత్రి సందర్శించి, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవోలు, వైద్యాధికారులతో సమావేశమై గాంధీ ఆసుపత్రిలోని సమస్యలు, రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలు, చేయాల్సిన పనులు తదితర అంశాలపై చర్చించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులతో కలసి ఆసుపత్రి ఆవరణ అంతా కలియ తిరిగారు. పేషంట్లను కలిసి వారికి అందుతున్న ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. గత కోవిడ్ పాండమిక్ లో పీఎం కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను సందర్శించి, దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గాంధీ ఆవరణలో మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి గాంధీ ని ఈ రోజు పర్యటనకు వచ్చానన్నారు. ఇక్కడి సమస్యలు, సౌకర్యాలు, అభివృద్ది పనులపై అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు ఆయా ఎంపీల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనకు వచ్చామన్నారు. కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపద్యంలో ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేయాలని, కరోనా ప్రొటోకాల్ ను ప్రజలు పాటించేలా గుర్తు చేయాలని చెప్పారన్నారు. గాంధీలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆర్ఎంవోలు, డాక్టర్లు,నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఆయన రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆధార్ కార్డు ఆధారంగా పేషంట్లకు సులభంగా ఓపీ నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో ఒక్కసారి మొబైల్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకుంటే గాంధీ తో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో భవిష్యత్ లో ఓపీ సేవలు పొందటం చాలా సులభమన్నారు. గాంధీలో కొన్ని పారిశుద్ద్య సమస్యలున్నాయని, వీటిని అధిగమించి, శానిటేషన్ పనులను ముమ్మరం చేయాలన్నారు.కొన్ని ఔట్ సోర్సింగ్ కంపెనీలు నెలల తరబడిగా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని తమకు సమాచారం ఉందని, వెంటనే ఆయా కంపెనీల కాంట్రాక్టర్లను పిలిచి, సిబ్బందికి జీతాలను వెంటనే ఇప్పించాలని కేంద్రమంత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
గాంధీలో తరచుగా ఎంఆర్ఐ, ఎక్స్ రే,ఈసీజీ, అల్ర్టా సౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్, గుండె సంబంధిత పరీక్షలు చేసే 2డీకో మెషిన్లు మొరయిస్తున్నాయని, దీనివలన దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని పలువురు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. వివిద టెస్టుల కోసం రోగులు రోజుల తరబడిగా పడిగాపులు కాయాల్సి వస్తుందని, పేషంట్ల రద్దీకి అనుగుణంగా మెషిన్ల సంఖ్య పెంచాలని కోరారు. ఘనత వహించిన గాంధీలో బీఎస్ఎన్ఎల్ సంస్థకు బిల్లులు చెల్లించకపోవడంతో గత కొంతకాలంగా ఫోన్లు పనిచేయడం లేదని పలువురు కేంద్ర మంత్రికి తెలిపారు. ఫోన్లు పనిచేయకపోవడంతో రోగులు, డాక్టర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే మెడిసన్స్ పూర్తి స్థాయిలో లభ్యం కావడం లేదన్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతు, సమస్యలు లేకుండా చూడాలని కేంద్ర మంత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కేంద్ర మంత్రి వెంట మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు, గాంధీ ఆసుపత్రి ఆర్ఎంవోలు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
