రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్
బోయిగూడలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ 113వ జనరల్ కౌన్సిల్ సమావేశం
సికింద్రాబాద్ జూన్ 17 (ప్రజామంటలు) :
దక్షిణమద్య రైల్వే ఉద్యోగ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించడం వలనే సౌత్ సెంట్రల్ రైల్వే ఉత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.
దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ 113వ జనరల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం సికింద్రాబాద్ బోయిగూడ లోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జనరల్ మేనేజర్ మాట్లాడుతూ... భవిష్యత్తులో కూడా ఉద్యోగులు మరింత కష్టపడి పని చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ను దేశంలోనే నెంబర్ వన్ గా చేయాలని ఆయన సూచించారు. ఎన్ ఎఫ్ ఐ ఆర్ జాతీయ కార్యదర్శి, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ విధానం, కొత్త పెన్షన్ విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పాత పెన్షన్ పద్ధతి అమలు చేసే వరకు తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
8వ పే కమిషన్ ప్రకటించిన కేంద్రం ఇప్పటివరకు దానికి చైర్మన్ ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. రైల్వేలో కార్మికులకు కనీస వేతనం 60 వేల రూపాయలు ఉండాలని, రైల్వేలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జూన్ నెల చివరన రిటైర్మెంట్ చేయబోతున్న జీఎం అరుణ్ కుమార్ ను ఎంప్లాయిస్ సంఘ్ తరఫున ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, సంఘ్ సంయుక్త కార్యదర్శి భరణి భాను ప్రసాద్, జోనల్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రుస్, ఎజీఎస్ లు రుద్రారెడ్డి, రవూఫ్, దక్షిణమధ్య రైల్వే లోని అన్ని డివిజన్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు.
దక్షిణ మద్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య జన్మదినం సందర్బంగా ఆయనకు పలువురు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసి, బాణసంచా కాల్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
