బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
సికింద్రాబాద్, జూన్ 16 ( ప్రజామంటలు) :
నిర్మల్ జిల్లా బాసర - ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో గోదావరి నది నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలైన ఘటనపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించి కేసు నెంబర్ 14075/IN/2025 గా నమోదు చేసింది. ఐదు నిండు ప్రాణాలు గల్లంతుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు.
బాసర క్షేత్ర గోదావరి లోని పుష్కరఘాట్ లో ఎలాంటి హెచ్చరిక సూచికలు, కంచెలు, మైక్ అనౌన్స్ మెంట్ లు లేవని, దరిదాపుల్లో గజ ఈతగళ్లు లేరని, కనీసం లైఫ్ జాకెట్లు లాంటి భద్రత ఏర్పాట్లు ఏవీ లేవన్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు తక్షణం స్పందించలేదని ఫిర్యాదు లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని అడ్వకేట్ రామారావు పిటిషన్ లో కోరారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
