విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మంత్రి అడ్డూరి
జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు)
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు
గిరిజన సంక్షేమ మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని, గౌరవ ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు మరియు విద్యుత్ ఉద్యోగుల సంఘం, 327 యూనియన్ జగిత్యాల జిల్లా సెక్రటరీ రాంజీ నాయక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చం ఇచ్చి శాల్వ తో ఘనంగా సన్మానించడం జరిగింది .
విద్యుత్ సంస్థ లో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల గురించి వారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ " ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 2004 వరకు విద్యుత్ ఉద్యోగుల కు కూడ వర్తింప చేయాలని , ఆర్టిసన్ల లకు గ్రేడ్ చేంజ్ , ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్, వివిధ రకాల సమస్యల గురించి చర్చించగా వారు సానుకూలంగా స్పందించి , వెంటనే విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్కతో పోన్ లో మాట్లాడగా అతి త్వరలో జాయింట్ మీటింగు ఏర్పాటు చేసి అన్ని సమస్యలు పరిష్కరీ స్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డివిజన్ ప్రసిడెంట్ ఏ. శంకర్ , కార్యదర్శి రాజమల్లు , ట్రెసరర్ ఎల్. ప్రకాష్ నాయక్ ధర్మపురి సబ్ డివిజన్ సెక్రటరీ కుమారస్వామి , దోనూరు, ఏ ఎల్ ఎం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
