దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల
ఇందిరమ్మ ఇండ్లతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలందరికీ న్యాయం
గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు):
సమైఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ఇందుకోసం సబ్బండా వర్గాలు ఏకమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న కానీ పేదల ఆశలు మాత్రం నెరవేరలేకపోయాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
గత ప్రభుత్వo పది సంవత్సరాల కాలంలో అరచేతిలో స్వర్గం చూపిస్తూ పేద ప్రజలను మోసం చేస్తూ వచ్చింది కానీ ఏనాడు కూడా వారికి న్యాయం చేయలేకపోయిందను, కానీ దశాబ్దం తర్వాత నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా సొంతింటి కలను నిజం చేస్తుందనీ అన్నారు.
ఇటీవల గొల్లపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండలంలోని 400 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడంతో పేదల సొంతింటి కల సాకరమైంది.
ఇందులో భాగంగా బుధవారం రోజు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మల్లన్నపేట గ్రామంలో ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోయడంతో లబ్ధిదారుల కళ్ళు ఆనందంతో ఉప్పంగిపోయాయి.దీంతో లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తమ సొంత ఇంటి కళను సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
