బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష
వెంట జీహెచ్ఎమ్సీ, విద్యుత్,పోలీస్ శాఖ అధికారులు
వర్షాలకు ముందుగానే పనులు చేయాలని ఆదేశం
సికింద్రాబాద్ మే 27 (ప్రజామంటలు):
సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్‌లో బ్రాహ్మణవాడి ప్రాంతంలో నెలకొన్న పలు దీర్ఘకాలిక సమస్యలను పరిశీలించేందుకు సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ మంగళవారం అధికారులతో కలిసి విస్తృత పర్యటన నిర్వహించారు. లేన్ 1 నుంచి లేన్ 7 వరకు వరుసగా సందర్శించిన ఆమె, వరద నీటి నిల్వ, డ్రైనేజీ, వీధి లైట్లు, విద్యుత్ స్తంభాలు తదితర సమస్యలను సమీక్షించారు. అధికారులతో కలసి పర్యటించిన ఆమె ఈసందర్బంగా కాలనీలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, హెచ్‌ఎంఎన్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ జనరల్ మేనేజర్ వినోద్, టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఏఈ సాయి, పోలీస్ శాఖకు చెందిన మొహక్ ఇక్బాల్‌తో పాటు ఆయా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే సమస్యలను పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని డా. నీలిమ అధికారులకు తెలిపారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఈప్రాంతంలో తలెత్తే సమస్యలు ఈ సారి పునరావృతం కాకూడదన్నారు. ప్రతి లేన్‌లోని పరిస్థితులను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసేందుకు చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో విషాల్ సుదం, హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్, సలీమ్ ఖాన్, మనోజ్ కుమార్, కృష్ణ, అల్తమాస్, చిరంజీవి, నసీర్ అడ్డు, తస్లీమ్, సబా, జగదీష్, అంజి బాబు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సౌందర్య లహరి బృందం చే పారాయణం

పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు
