ఘనంగా గౌతమ హైస్కూల్ స్పోర్ట్స్ మీట్
జగిత్యాల ఫిబ్రవరి 18(ప్రజా మంటలు)
పట్టణంలోని *గోవిందుపల్లె, విద్యా నగర్ గౌతమ హై స్కూల్* విద్యార్థులకు ఎడ్ల అంగడి రామాలయం ప్రాంగణంలో జరిగిన వార్షిక స్పోర్ట్ మీట్.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి వాసం భీమయ్య పావురాన్ని ఎగురవేసి, స్కూల్ చైర్మన్ కంది కైలాసం స్పోర్ట్స్ జెండా ను ఎగుర వేయగా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులచే క్రీడా జ్యోతి నీ వెలిగించి లాంఛనంగా క్రీడలను ప్రారంభించారు..
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ క్రీడల వలన విద్యార్థులు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉంటారని, మెదడు చురుకుగా పని చేసి చదువుల్లో రాణిస్తారని, ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన స్కూల్ విద్యార్థులను అభినందించారు, కంది కైలాసం మాట్లాడుతూ స్కూల్ లో విద్యార్థులకు ప్రతి ఏడాది ఇలాగే వార్షిక స్పోర్ట్ మీట్ నిర్వహించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ దీనిద్వారా విద్యార్థులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించడం జరుగుతుందని
తెలిపారు.
ఈ స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులు చేసిన పిరమిడ్స్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి., విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ ను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు.,
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వాసం భీమయ్య, ఆలయ కమిటీ మెంబర్లు అశోక్ రావు, వెంకట్ రావు, విఠలయ్య, చిరంజీవి, నర్సింగరావు, మురళీ మనోహర్ చారీ, డి సిఈబి , బిజేపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, తపస్ ఉపాద్యాయ సంఘ నాయకులు వోడ్నాల రాజశేఖర్, స్కూల్ చైర్మన్ కంది కైలాసం, పాఠశాల కరస్పాండెంట్ కంది అన్నపూర్ణ కైలాసం, స్కూల్ సిబ్బంది కవిత తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)