సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం
300 పడకల ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 16 (ప్రజామంటలు) :
యూరప్‌లోని అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూపులలో ఒకటి గా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ అత్యంత గౌరవనీయమైన హెల్త్‌కేర్ బ్రాండ్ గా గుర్తింపు పొందటంతో పాటుగా హాస్పిటల్స్ తో భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్ గా గుర్తింపు పొందిన మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు నగర వాసుల కోసం తమ 24 వ హాస్పిటల్ 300 పడకల వైద్య సేవలను సికింద్రాబాద్ కి విస్తరించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖామంత్రి బండి సంజయ్ కుమార్,రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్, కార్పొరేటర్లు కొంతం దీపిక, చీర సుచిత్ర పాల్గొన్నారు.
ఈసందర్బంగా కేంద్ర జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో, మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో తమ 24 వ నూతన ఆస్పత్రిని ప్రారంభించడం చాల అభినందనీయం.ప్రజలందరికీ ప్రాథమిక వైద్యం నుంచి అత్యాధునిక చికిత్సల వరకు సమానంగా అందించాలని అన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ యొక్క ముల్టీస్పెషాలిటీ ఆస్పత్రి మరియు అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్య బృందం కలిగిన ఈ హాస్పిటల్ రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని అన్నారు.బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ “సాధారణ ప్రజలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికిత్స పొందగలిగే అవకాశం కల్పించడం ఎంతో గొప్ప విషయం.
మెడికవర్ వైద్యులు సేవా దృక్పథంతో పని చేసి, సమాజంలో విశ్వాసాన్ని పెంచుతారని నాకు నమ్మకం ఉంది అని అన్నారు. రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..ప్రజలకు చేరువలో ఉండే ఆసుపత్రులు మాత్రమే నిజమైన ప్రజాసేవ చేస్తాయన్నారు. మెడికవర్ ఈ కొత్త భవనం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి సిద్దంగా ఉండటం అభినందనీయం. ఇది రోగులలో విశ్వాసం కలిగించే కేంద్రంగా నిలుస్తుందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ మాట్లాడుతూ.... భారత దేశంలో అగ్రగామి మల్టీనేషనల్ హాస్పిటల్ చైన్ గా ప్రస్తుతం 24 హాస్పిటల్స్ ని తాము ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాదిమందికి ఖచ్చితమైన వైద్య సేవలను అందిస్తున్నామని, రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరించే మెడికవర్ హాస్పిటల్స్ అందుబాటు ధరల్లో ఖచ్చితమైన చికిత్సను అందించటంలో దేశవ్యాప్తంగా తన ప్రత్యేకతను నిలుపుకుందన్నారు. అత్యాధునిక సాంకేతికత తో అత్యున్నత నైపుణ్యం మిళితం చేసి ఇక్కడ అందించే వైద్య సేవలు ఎంతోమందికి నూతన జీవితాన్ని అందిస్తాయి.
అత్యంత నిష్ణాతులైన 40 మందికి పైగా డాక్టర్ల తో పాటుగా ప్రపంచస్థాయి సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అని అన్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,తెలంగాణా తో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక లలో కూడా మెడికవర్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నాం" అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
