గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు
సమస్యల పరిష్కారానికి సూపరింటెండెంట్ హమీ
*ఆసుపత్రి వద్ద ధర్నా పిలుపు విరమణ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 15 (ప్రజామంటలు):
గాంధీ హాస్పిటల్‌లో నెలకొన్న సమస్యలపై ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పి.వై.ఎల్) ధర్నాకు పిలుపునివ్వగా, సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రతినిధి బృందాన్ని చర్చలకు ఆహ్వానించారు. దీంతో ధర్నాను విరమించిన పి.వై.ఎల్ నాయకులు సోమవారం సూపరింటెండెంట్ తో సమావేశమై 18 డిమాండ్లను ప్రస్తావించారు. ఓపి కౌంటర్ల సంఖ్య పెంపు, కాజువాలిటీ విభాగంలో డాక్టర్లు -నర్సులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు, ప్రభుత్వమే అన్ని రకాల మందులు ఉచితంగా ఇవ్వడం, ప్రైవేట్ మెడికల్ షాపులను తొలగించడం, స్కానింగ్-ఎక్స్ రే సదుపాయాలను పెంచడం, బార్‌కోడ్ యూరిన్ శాంపిల్స్, వీల్‌చైర్లు-స్ట్రెచర్ల సంఖ్య పెంపు, రోగుల బంధువులకు కనీస వసతులు కల్పించాలన్నారు.
అలాగే ఉచిత టాయిలెట్లు, ఎం.సి.హెచ్ భవనంలో కుర్చీలు ఏర్పాటు, ఆర్.ఎం.ఓ లు బాధ్యతగా వ్యవహరించడం, పార్కింగ్ సక్రమంగా అమలు, సూచిక బోర్డులు ఏర్పాటు, సెక్యూరిటీ-శానిటరీ సిబ్బందికి ప్రత్యేక రూములు, సకాలంలో జీతాలు వంటి కీలక డిమాండ్లు ప్రతిపాదించారు. సూపరిండెంట్ వాణి ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, మిగిలిన వాటిని నెలరోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల జీతాలు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు.
ఈ సమావేశంలో టి.యు.సి.ఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కె.ఎస్. ప్రదీప్, పి.వై.ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రవి కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు బి.ఎస్. కృష్ణ, కొల్లూర్ భీమేష్, ఉపాధ్యక్షులు కుంబోజీ కిరణ్, మల్లేష్, సహాయ కార్యదర్శి బాలు, కోశాధికారి ప్రకాష్, సభ్యులు కొల్లూర్ శంకర్, వంకాయల సురేష్, రాజు, అంజి, టి.యు.సి.ఐ నాయకుడు తలారి వెంకటేష్ పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
