స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి
తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ఆందోళన
సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు)
:
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( టీ జూడా) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ పీజీలు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థుల తరఫున తమ ఆందోళనను వ్యక్తం చేసింది. వేతన భత్యాల (స్టైఫండ్ల) విడుదలలో జరుగుతున్న నిర్లక్ష్యం, ఆలస్యం కారణంగా జూనియర్ డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జూనియర్ డాక్టర్ల గాంధీ యూనిట్ అసోసియేషన్ అద్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆధ్వర్యంలో సంస్థలు స్టైఫండ్ల ప్రతిపాదనలు సమర్పించినా, ఆరోగ్య శాఖలో ఆమోదాలు నిలిచిపోతున్నాయని, ఫలితంగా స్టైఫండ్లు సమయానికి అందడం లేదని పేర్కొన్నారు.
ఈ ఆలస్యం వల్ల చాలా మంది డాక్టర్లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని జూడా పేర్కొంది.తాము చాలామంది భోజనం, అద్దె, ప్రయాణ ఖర్చులు కూడా భరించలేకపోతున్నాం. పరీక్షా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉంది. స్టైపెండ్లపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి అని టీజూడా హైలైట్ చేసింది. ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా, ప్రతి నెలా మళ్లీ మళ్లీ ఫాలో అప్ చేయాల్సి వస్తోందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్థిక కష్టాలను భరించుకుంటూ నిరంతరం పనిచేస్తున్నామని, కానీ అధికారుల నుంచి స్పందన కనిపించడంలేదని తెలిపింది.
టీ జూడా ముఖ్య డిమాండ్లు ఇవి..:
1. పెండింగ్‌లో ఉన్న అన్ని స్టైపెండ్లను బకాయిలతో సహా తక్షణమే విడుదల చేయాలి.
2. డీఎంఈ కి నేరుగా స్టైపెండ్ల విడుదల చేసే అధికారం ఇవ్వాలి
3. నెలవారీగా స్థిరమైన టైమ్ బౌండ్ షెడ్యూల్ అమలు చేసి, ఆలస్యాలకు బాధ్యత వహించే విధానాన్ని ఏర్పాటు చేయాలి.
ఇది కేవలం పరిపాలనా అంశం కాదు. ఇది న్యాయం, గౌరవం, మరియు ప్రాణాధారమైన అంశం. ఈ సమస్యను ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే, జూనియర్ డాక్టర్లు మరియు ఆరోగ్య సిబ్బంది ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేపట్టవలసి వస్తుందని జూడా ప్రెసిడెంట్ అజయ్ తెలిపారు. రాష్ర్ట వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి తక్షణం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి అని కోరారు.
––
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
