గాంధీ ఆసుపత్రిలో నూతన ఆర్థోపెడిక్, బర్న్స్ ఆపరేషన్ థియేటర్ల ప్రారంభం
సికింద్రాబాద్, అక్టోబర్ 06 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నూతనంగా పునరుద్ధరించబడిన ఆర్థోపెడిక్, బర్న్స్,ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్, వార్డ్ లను సోమవారం డోనర్స్ తో కలసి సూపరింటెండెంట్ డా.వాణి ప్రారంభించారు. దాదాపు రూ35 లక్షల నిధులతో ఆర్దోపెడిక్, బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్స్ తో పాటు వార్డులను రెనోవేషన్ చేసిన డోనర్స్ అర్పన్ రోగి సహాయత ట్రస్ట్ నిర్వాహకులు ఖివ్రాజ్ సురానా, ఎస్పీఎం గ్రూప్,ఎన్వీఎస్ రిఫ్కాంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులను సూపరింటెండెంట్ డా.వాణి, ప్రిన్సిపాల్ ఇందిర అభినందించి, సన్మానించారు. దీనివలన గాంధీ ఆసుపత్రికి వచ్చే వేలాది మంది పేషంట్లకు మరింత మెరుగైన వైద్యం అందుతుందన్నారు. డోనర్స్ గతంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పునరుద్దరణతో పాటు కవాడిగూడ, బన్సీలాల్ పేట శ్మశానాల పునరుద్దరణ కూడ నిర్వహిస్తుందన్నారు.
అర్పన్ రోగి సహాయత ట్రస్ట్ సంస్థ ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, అత్యవసర సేవలలో పలు ప్రాజెక్ట్ లను అమలు చేస్తూ, వేలాది మంది రోగులకు అందుబాటులో వైద్యం అందిస్తుందని డోనర్స్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.రవిశేఖర్ రావు,ఆర్ఎంవో 1 డా.శేషాద్రి,డా.సుబోద్, డా.కళ్యాణ్, డా.రజని,వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
