దక్షిణాసియా యువకుడికి అరుదైన గౌరవం
హానరరీ ఎఫ్‌ఆర్సీఎస్ (గ్లాస్గో) పొందిన తొలి శస్త్రవైద్యుడు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 11 (ప్రజామంటలు) :
కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. 425 ఏళ్ల చరిత్ర కలిగిన గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ వారు ఆయన్ని హానరరీ ఎఫ్‌ఆర్సీఎస్ (గ్లాస్గో)తో సత్కరించారు. ఈ గౌరవం పొందిన దక్షిణాసియాలోని అతి పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. గ్లాస్గోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కాలేజ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా ఈ ఫెలోషిప్‌ను అందించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, చికిత్సలో డాక్టర్ రఘురామ్ చేసిన కృషి అసాధారణం అని ఆయన అభినందించారు. 1997లో ఇదే కాలేజ్ నుంచి ఎఫ్‌ఆర్సీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన రఘురామ్, ఇప్పుడు హానరరీ ఫెలోషిప్‌తో ప్రపంచంలోనే ఏకైక ప్రత్యేక గుర్తింపు పొందిన వైద్యుడిగా నిలిచారు. ఆయనకు పద్మశ్రీ, డాక్టర్ బి.సి. రాయ్ అవార్డు, బ్రిటన్ ప్రభుత్వం ప్రదానం చేసిన ఓబీఈ సహా పలు అంతర్జాతీయ గౌరవాలు లభించాయి. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన రఘురామ్, దక్షిణాసియాలోనే తొలి సమగ్ర బ్రెస్ట్ హెల్త్ సెంటర్ స్థాపనలో ముందుండారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టి, వేలాది మహిళలకు సేవలందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు
