పొన్నం, అడ్లూరి ల మధ్య రగిలిన జాతుల గొడవ
తలనొప్పిగా మారిన పంచాయతీ అధిష్ఠానం జోక్యం చేసుకొంటుందా?
హైదరాబాద్ అక్టోబర్ 07:
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ల మద్య తలెత్తిన జాతుల మద్య రగిలిన గొడవ సద్దుమణగించడానికి పీసీసీ రంగంలోకి దిగింది. పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం, కాంగ్రెస్ మంత్రుల మధ్య ఉన్న విభేదాలను స్పష్టం చేస్తున్నాయి.
పొన్నం చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని, కనీసం పొన్నం క్షమాపణ కూడా చెప్పక పోవడాన్ని మంత్రి అడ్లూరి తప్పుపట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం గెలుపుకు ఎంతో కృషిచేశానని, కనీస కృతజ్ఞత లేకపోగా .ఇంత నీచంగా విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, తమ సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ కూడా తనపట్ల చిన్న చూపు చూస్తున్నారని అడ్లూరి తన అనునయాల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు కేబినెట్ మంత్రుల మధ్య వచ్చే విబేధాలు పెద్దవి కాకుండా, మరింత వైరల్ కాకుండా పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ను అధిష్టానం రంగంలోకి దించినట్లు సమాచారం .మంత్రులు పొన్నం, అడ్లూరితో పీసీసీ చీఫ్ ఫోన్‌లో మాట్లాడారని, ఇద్దరు నేతలు సంయమనం పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది.
పొన్నం వివరణ
ఇదిలా ఉంటే అడ్లూరిని ఉద్దేశించి తాను ఆ మాటలు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను ఎవరో కావాలనే వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు.తాను వ్యక్తిగతంగా దూషించలేదని, మంత్రి అడ్లూరికి కలవడానికి ప్రయత్నించినా దొరకడంలేదని మంత్రి పొన్నం అన్నారు.
.. ” నేను దున్నపోతు అన్నప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.. కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప మరేమీ లేదు ” అన్నారు. ఈ విషయంపై అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ అందుబాటులోకి రాలేదనీ పొన్నం చెప్పారు. దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
పొన్నంకు అల్టిమేటం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపటిలోగా క్షమాపణ చెప్పాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కోరారు. అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో అడ్లూరి మాట్లాడుతూ.. మాదిగలంటే అంతా చిన్నచూపా అని పరోక్షంగా మంత్రి పొన్నంను ప్రశ్నించారు. తనను అన్న మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ కోరితే ఆయనకు గౌరవం ఉంటుందని అన్నారు. దీనిపై త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలను కలుస్తానని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
