మాదిగలను అవమానించిన మంత్రి పొన్నం ను మంత్రి పదవి నుంచి తొలగించాలి ఎమ్మార్పీఎస్ డిమాండ్.
జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం
జగిత్యాల అక్టోబర్ 07 (ప్రజా మంటలు):
మాదిగల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన మంత్రి పొన్నం*
*మాదిగలకు వేను వెంటనే క్షమాపణ చెప్పాలని,మాదిగలను అవమానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ తహసిల్ చౌరస్తాలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం రోజున హైదరాబాద్ లోని "జూబ్లీహిల్స్" లో జరిగిన పాత్రికేయుల సమావేశం లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కించపరుస్తూ మాట్లాడడాన్ని ఖండిస్తూ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు.
కాలయాపన చేయకుండా వెంటనే అడ్లూరి లక్ష్మణ్ కు,అలాగే మాదిగలకు క్షమాపణ చెప్పాలని, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరింత ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దూమల గంగారం ఎమ్మార్పీస్, జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్,ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, చెట్టుపల్లి లక్ష్మణ్, మాజీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు దుమల రాజ్ కుమార్ హుమెన్ రైట్స్ రాష్ట్ర నాయకులు నక్క గంగారం దుమల జిల్లా కార్యదర్శి సంగేపు ముత్తు, జిల్లా నాయకులు నక్క సతీష్,దుమల గంగాధర్, , నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లారపూ దివాకర్, కో ఇంచార్జి పోడేటి సునీల్, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి చిర్ర లక్ష్మణ్, అర్బన్ మండల అధ్యక్షుడు బాబురావు గంగారం, బాపురపు వంశీ,ఎలగందుల మోహన్, లింగంపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
