జగిత్యాలలో సాయి స్వస్థ వెల్ నెస్ సెంటర్ ఆధ్వర్యంలో పుట్టుకతో వచ్చే హృదయ సంబంధ వ్యాధుల నిర్దారణ శిబిరం
జగిత్యాల అక్టోబర్ 8 ( ప్రజా మంటలు)
సాయి స్వస్థ వెల్ నెస్ సెంటర్ ఆధ్వర్యంలో పుట్టుకతో వచ్చే హృదయ సంబంధ వ్యాధుల నిర్దారణ శిబిరాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గుండె సంబంధించి సమస్యలను 2D కో ద్వారా పరీక్షించి చికిత్స అవసరం ఉన్న వారిని సిద్దిపేట లోని శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ గుండె ఆపరేషన్లు చాలా ఖర్చుతో కూడుకున్నవని పేద ప్రజలు ఆపరేషన్లు చేయించుకునెంత స్తోమత ఉండదని అన్నారు. ఈ పరిస్థితుల్లో సాయి స్వస్థ వెల్ నెస్ ఆధ్వర్యంలో గుండె సంబంధిత నిర్ధారణ పరీక్షలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ప్రజలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సత్య సాయి వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంకు సమీపంలోని కొండపాకలోని వారి ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా వైద్య పరీక్షలు,ఆపరేషన్లు చేయడం జరుగుతుందని వివరించారు. ఇందుకుగాను ఆ సంస్థ నిర్వాహకులను, స్థానిక సాయి స్వాతంత్ర వెల్ నెస్ సెంటర్ బృందాన్ని అభినందించారు.
సమావేశంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తో పాటుగా కొండపాక ఆసుపత్రి నిర్వహణ ప్రతినిధి శర్మ, ఐ ఎం ఏ జగిత్యాల శాఖ అధ్యక్ష కార్యదర్శులు డా. హేమంత్, డా. శ్రీనివాస్ రెడ్డి, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాస్, జగిత్యాల సాయి స్వస్థత వెల్ నెస్ సెంటర్ ప్రతినిధులు కోటగిరి శ్రీనివాస్, పాల్తెపు భూమేశ్వర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
