బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.
ఎండపల్లి అక్టోబర్ 09 (ప్రజా మంటలు):
ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు.బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లిలో రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీనితో రాజీవ్ రహదారిపై రవాణా స్తంభించింది.
రోడ్డు కిరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
స్థానిక ఎస్సై తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను రోడ్డుపై నుండి తొలగించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ కు మధ్య. సల్ప వాగ్వివాదం, చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు రోడ్డుపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు రాకపోవడంతో రాజారాంపల్లిలోని అక్షర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించి, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న ఎంఈఓ విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం అక్షర హైస్కూలు యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థుల జీవితలతో అడుకివద్దని హెచ్చరించారు. దీనితో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసేవరకు విద్యార్థులను యధావిధిగా తరగతులకు అనుమతించేలా విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని హైస్కూల్ యాజమాన్యం ఆదేశించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
