ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు
ఆర్మీ ఏరియాలో ఫైర్ ఇన్సిడెంట్ తో ఆర్మీ సిబ్బంది అలర్ట్..
సికింద్రాబాద్, అక్టోబర్ 09 (ప్రజామంటలు) :
కంటోన్మెంట్ లో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఏఓసి రోడ్డు లో విద్యార్థులతో వెళుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు. అక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది అలర్ట్ అయి, విద్యార్థులను బస్సు నుంచి దింపి ప్రమాదం నుండి కాపాడారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, ఫైర్ ఇంజన్ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. దీంతో అటు పిల్లలు ఇటు సైనికులు ఊపిరి పీల్చుకు న్నారు. ప్రమాద సంఘటన జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే వాహనాల్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలను తెలుసుకొనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పిల్లల తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
