పిల్లలకు కాఫ్ సిరప్ ఇచ్చే ముందు జాగ్రత్త! డాక్టర్ హెచ్చరిక
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వేసుకోవద్దు..
గాంధీ పీడియాట్రిక్ హెచ్ఓడీ డా.వాసుదేవ్
సికింద్రాబాద్, అక్టోబర్ 06 (ప్రజామంటలు) :
పిల్లలకు కాఫ్ సిరప్ ఇచ్చే ముందు పేరేంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని గాంధీ ఆసుపత్రి పీడియాట్రిక్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.కే.వాసుదేవ్ పేర్కొన్నారు. ఇటీవల మద్యప్రదేశ్ లో కాఫ్ సిరప్ తాగి పలువురు చిన్నారులు మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ నేపద్యంలో ఆయన వెలుగు తో మాట్లాడుతూ.. కాఫ్ సిరప్ వాస్తవ రూపంకోసం వేరే పదార్థాలు కలిపి లేబుల్‌పై మాత్రం వాటిని మెన్షన్ చేయరని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో కాఫ్ సిరప్ తాగి పలువురు చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. పిల్లలకు వరసగా మూడు రోజులు దగ్గు వస్తే యాంటీబయెటిక్ సరిపోతుందన్నారు. ఒకవేళ తగ్గకపోతే వైద్యులు సూచించిన మేరకే దగ్గు మందు, సూచించిన మోతాదు లోనే ఇవ్వాలన్నారు.
పెయింట్ కంపెనీల్లో వాడే డైఇథనాల్ గ్లైకాల్ రీఫైండ్ చేసి కలుపుతారని, దాని మోతాదు మించితే ప్రాణాంతకం అవుతుందని అన్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా, తామే సొంతంగా మెడికల్ దుకాణాలకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వేసుకోవడం మంచిది కాదన్నారు. చిన్నారుల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలకు తప్పనిసరిగా వైద్యుల సలహాలు అవసరమన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
