దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ
ఆకస్మికంగా గాంధీ ఆసుపత్రి సందర్శన
సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) :
కార్పోరేట్ ఆస్పత్రులకు తీసిపోని విదంగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిని తీర్చిదిద్ధి బ్రాండింగ్‌కే బ్రాండ్ అంబాసిడర్‌గా దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతామని మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డీఎంఈ ప్రొఫెసర్ వాణి అన్నారు. హెల్త్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆమె బుధవారం గాంధీఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించి, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ఉద్ధేశించిన బ్రాండింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. టీజీఎంఎస్ఐడీసీ అధికారులు, గాంధీ పాలనయంత్రాంగంతో కలిసి అవుట్ పేషెంట్ విభాగంలోని రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్లు, అయుష్మాన్భారత్ (అభా) నమోదు, రోగుల టాయిలెట్లు, ఏఏ విభాగాలు ఎక్కడ ఉన్నాయో తెలిపే సైన్‌బోర్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఆరా తీశారు. ఓపీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పాత టైంటేబుల్తో ఉన్న బోర్డులను అప్పటికప్పుడే తొలగించారు. సెంట్రల్ల్యాబ్, సీటీ స్కానింగ్ వద్ద గర్భిణీలు, మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరిన దృశ్యాన్ని చూసిన ఆమె తక్షణమే ఆయా ప్రాంతాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నిరుపేద రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యసేవల్లో జాప్యం చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేంది లేదన్నారు. ఓపీ విభాగంలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలోనే గాంధీకి స్పెషల్ ఆఫీసర్ నియామకం...
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు గాంధీఆస్పత్రిలో త్వరలోనే స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తామని అడిషనల్ డీఎంఈ వాణి స్పష్టం చేశారు. గాంధీఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. స్పెషల్ ఆఫీసర్ నియామకంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గాంధీ పాలనయంత్రాంగం, వైద్యులు, మీడియా కలిసి నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామన్నారు.
గాంధీకి స్పెషల్ఆఫీసర్గా వస్తారా అని మీడియా ప్రశ్శించగా, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తానని అన్నారు. గాంధీ సూపరింటెండెంట్ సీహెచ్ఎన్ రాజకుమారి, ఆర్ఎంఓ–1 శేషాద్రి, అనస్టీషియా ప్రొఫెసర్ కిరణ్ మాదల, ఆర్‌ఎంఓలు సుథార్సింగ్, రజనీ, గాంధీ ఆఫీస్ మేనేజర్ వెంకటరమణ,శివరామిరెడ్డి లతోపాటు పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
