శ్రీ సత్య సాయి శతావర్ష సేవా యజ్ఞం - వెయ్యి మంది నిరుపేదలకు సాయం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :
పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్బంగా శివం రోడ్డు లోని సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సత్య సాయి సేవా సంస్థ ప్రతినిధి సాయిబాబా తెలిపారు. సమాజంలో అట్టడుగున ఉన్న బలహీనవర్గ, పేద ప్రజల ఉన్నతి,విద్యా, ఉపాధి స్వావలంబన రంగాలలో వారిని ప్రోత్సహించే విదంగా సత్య సాయి శతావర్ష సేవ యజ్ఞం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు దయ, కరుణతో వ్యక్తిగత అభివృద్ది, సామాజిక ప్రగతిని సాధించడానికి దోహదపడుతాయన్నారు.
పేదలకు సాయం ఇలా.....
విద్య, ఉపాధి అవకాశాలకు డెస్క్ టాప్లు, ల్యాప్ టాప్ లు, నైపుణ్య అభివృద్ది , స్వయం ఉపాధికి సహాకారం కోసం టైలరింగ్ మిషన్లు, వికలాంగులకి సులభ గమనం, ఆత్మగౌరవం కోసం ట్రై సైకిళ్ళు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగుల కోసం హౌజ్ వైరింగ్, ఎలక్ర్టిక్ మోటర్ వైండింగ్ టూల్ కిట్లు , నైపుణ్య వృత్తుల ప్రోత్సాహం కోసం ప్లంబర్,కార్పెంటర్ టూల్ కిట్లు, ఇంటి ఆధారిత ఆహార వ్యాపారాలకు వెట్ గ్రైండర్లు, మహిళలు స్వంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు గాను బ్యూటీషియన్ కిట్లు, చిన్న వ్యాపారుస్థులకి స్థిరమైన ఉపాధికై ఫుష్ కార్టులు, విద్యా ద్వారా మెరుగైన భవిష్యత్ కోసం విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.
రాష్ర్ట వ్యాప్తంగా ఒక వెయ్యి మందిని శివం రోడ్డులో ఉన్న సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎంపిక చేయనున్నట్లు సాయిబాబా వివరించారు. అర్హులైన వారు ఆన్ లైన్ లో గూగుల్ ఫామ్ ద్వారా సెప్టెంబర్ 20 లోగా https://forms.gle/qXnn9TWLcRVFcC9N7 దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99080 51617 నెంబర్ కు కాల్ చేయాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
