జిల్లా కలెక్టరేట్ లో 60 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం.

On
జిల్లా కలెక్టరేట్ లో 60 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 7 (ప్రజా మంటలు)

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రధానం.

IMG-20250907-WA0018

జిల్లాలోని 4074 మంది ఉపాధ్యాయులకు గాను 60 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆడిటోరియం లో పురస్కారాలు ప్రధానం

డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్బంగా జిల్లాలోని 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి,కలెక్టర్ సత్యప్రసాద్ చేతులమీదుగా ఘనంగా సన్మానించారు.

IMG-20250907-WA0016

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో ఆదివారం జిల్లాకలెక్టర్ సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్యఅతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి డా.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. 

IMG-20250907-WA0013

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

  • ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
  • రోజు రోజుకూ, మారుతున్న కాలానికనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక, నైపుణ్యతతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు.
  • తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తారని వివరించారు.
  • రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు.
  • సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు.
  • ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకాశం కల్పించిందని వివరించారు.
  • ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు.
  • రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వర్గాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు.
  • అలాగే ఏ.టి.సి సెంటర్లు మంజూరు చేసిందని దీంతో విద్యార్థులు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత అది పుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన ధర్మపురి ప్రాంతానికి చెందిన గొల్లపల్లి గణేష్ ను సన్మానించారు.

IMG-20250907-WA0022

 

IMG-20250907-WA0015

పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ....

  • 1962 లో ఉపాధ్యాయ దినోత్సవ ప్రారంభించారు.
  • భారత దేశ ఉప రాష్ట్రపతి డా. సర్వేపల్లి జయంతి సందర్బంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుని దేశంలోని, రాష్ట్రం లోని అత్యుత్తమ ఉపాధ్యాయులను ఎన్నుకుని పురస్కారాలు అందించడం జరుగుతుంది.
  • గురువును గౌరవించుకోవడం అంటే జ్ఞానాన్ని గౌరవించుకోవడం అని తెలిపారు.
  • తండ్రి ఆస్తులు అందిస్తే గురువు జ్ఞానన్ని అందిస్తారు.
  • జ్ఞానం నీ సంపద అయితే విజయం నీ బానిస అవుతుంది అని అన్నారు.
  • అదే విధంగా అవినీతి లేని ఉత్తమ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని కొనియాడారు.
  • అనంతరం కెరీర్ గైడెన్స్ అనే పుస్తకం విద్యార్థుల భవిష్యత్ కు పునాది రాయిల ఉపయోగపడుతుంది అని ప్రతి ఒక్క ఉపాద్యాయుడు ఈ పుస్తకాన్ని విద్యార్థులకు అందించాలని కోరారు.

IMG-20250907-WA0012

కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ......

  • డా సర్వేపల్లి అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకోవాలి-జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికవ్వాలి-కలెక్టర్
  • డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేస్తూ, ఆయన సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు.ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు .
  • డా.సర్వేపల్లి రాధాకృష్ణ తనకు వచ్చే వేతనంలో 75 శాతం వరకు పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలకు అందించే వారన్నారు.
  • *హెల్ప్ ఏజ్ ఇండియా* సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారని, బ్రిటిష్ ఇండియా లో నైట్ హుడ్ అవార్డు స్వీకరించారని గుర్తు చేశారు.
  • భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, విద్యావిధానం గొప్పదని తన రచనల్లో వివరించారని పేర్కొన్నారు.
  • రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారని గుర్తు చేశారు.
  • ఆయన సేవా గుణం, ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విలువైన సేవలు ఆయనను ఇప్పటికీ నిలిచిపోయేలా చేశాయని పేర్కొన్నారు.
  • తనది మద్రాస్ రాష్ట్రమైన కూడా కలకత్తా ఇతర ప్రాంతాల్లో సేవలందించారని తెలిపారు.
  • ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని గుర్తు చేశారు. ఎక్కడ ఉన్నా కూడా పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
  • ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని, విద్యార్థులకు సులభమైన రీతిలో పాఠాలు బోధించాలని తెలిపారు.
  • ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బోధించాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.లత జిల్లా విద్యాధికారి కే. రాము, జిల్లా ప్రోగ్రాం అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, మరియు జిల్లా సమగ్ర శిక్ష కో - ఆర్డినేటర్ అధికారులు, వివిధ సంఘాల ఉపాధ్యాయ నాయకులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

IMG-20250907-WA0021

Tags
Join WhatsApp

More News...

State News 

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు): ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ...
Read More...
Local News 

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు  కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత  అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   అదనపు కలెక్టర్ (రెవెన్యూ)  బిఎస్ లత  మాట్లాడుతూ...
Read More...
National  International  

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం – ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా...
Read More...
Local News 

ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం

ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు): వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కవితతో...
Read More...
Local News 

సైబర్ మోసలకు  గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి:సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ 

సైబర్ మోసలకు  గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి:సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ  జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాల నివారణ పై    అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా...
Read More...
State News 

వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత

వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.పిల్లల పరీక్షల...
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.   సందర్భంగా  సన్మానాలు                            

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.   సందర్భంగా  సన్మానాలు                                 జగిత్యాల మార్చి 8:తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సన్మానించారు.   ధర్మపురి...
Read More...
State News 

హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు): దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన...
Read More...
State News 

మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ ధర్నా – సింగూర్ ఉద్యమం జ్ఞాపకాలతో ఎన్నికల సమరానికి సంకేతం

మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ ధర్నా – సింగూర్ ఉద్యమం జ్ఞాపకాలతో ఎన్నికల సమరానికి సంకేతం బెంగాల్ రాజకీయాలపై ప్రత్యేక కథనం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee మరోసారి కోల్‌కతాలోని Metro Channel వద్ద ధర్నా చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు నిరసనలు నిర్వహించే ప్రదేశంగా ఈ స్థలం ప్రసిద్ధి పొందింది. కానీ మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది....
Read More...
Local News  Crime 

రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం

రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):     రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ...
Read More...
Local News  State News 

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
Read More...
Crime  State News 

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు): హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర...
Read More...