మానవత్వంతో వ్యవహరించిన సీఏఆర్ కానిస్టేబుల్‌కు టీఎస్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ ప్రశంస
హైదరాబాద్ సెప్టెంబర్ 09:
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) చైర్‌పర్సన్, గౌరవ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్, గత వారం నగరంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఒక యువతిని రక్షించి, సురక్షితంగా ఇంటికి చేర్చిన హైదరాబాదు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ ను నేడు ప్రశంసిస్తూ అభినందన పత్రం అందజేశారు.
సంఘటన వివరాలు:-
7-8-2025 వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బంజారా హిల్స్ రహదారులు నడుము లోతు వరద నీటితో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో, చైర్‌పర్సన్ భద్రతా బృందంలో పైలట్-కమ్-ఎస్కార్ట్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ, రోడ్ నెం. 3 వద్ద బస్టాప్‌లో ఒంటరిగా నిలబడి భయాందోళనలకు లోనైన 22 ఏళ్ల యువతి నైనికను గమనించారు.
ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకుంటూ రామంతపూర్‌లో కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చిన నైనిక, తన అన్న వదిలి వెళ్ళిన తర్వాత పెరుగుతున్న వరదలో ఇరుక్కుపోయింది. నీటి భయం (హైడ్రోఫోబియా)తో విలవిలలాడుతూ, మొబైల్ ఫోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులను సంప్రదించలేని పరిస్థితి. ఈ సమయంలో, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ నడుము లోతు నీటిలోకి వెళ్లి, ఆమెకు తన జెర్కిన్ ఇవ్వడంతో పాటు ధైర్యం చెప్పి, ఆమె కుటుంబ సభ్యులను సమాచారం అందించారు.
ప్రయాణ సౌకర్యాలు లభించకపోవడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆయన స్వయంగా నైనికను వానలతో ముంచెత్తిన రహదారులను దాటుతూ వనస్థలీపురంలోని ఆమె ఇంటికి తీసుకెళ్లి, రాత్రి ఆలస్యంగా తల్లి, చెల్లెలు వద్దకు క్షేమంగా చేర్చారు.
ఈ సంఘటన పత్రికలు మరియు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందింది. దీనిపై డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ సేవను,విధి నిర్వాహణకు మించి మానవత్వం మరియు కర్తవ్యబద్ధతకు ప్రతీకగా అభినందించారు.
ఆయన చూపిన నిస్వార్థ సేవ ఒక బాధలో ఉన్న పౌరుడి సురక్షితత్వం, గౌరవాన్ని కాపాడడమే కాకుండా, పోలీసింగ్ మరియు మానవ హక్కుల పరిరక్షణలోని అసలు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చైర్‌పర్సన్ పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం... జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు
జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర... జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి
జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):
జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు... జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్
జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య... సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?
న్యూఢిల్లీ మార్చ్ 05:
భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత... సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్... కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.
హోళీ సందర్భంగా... దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక
న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.
AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International... 