ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి
జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
ఇసుక బజార్' లను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
బుధవారం జిల్లాకేంద్రంలోని వాణినగర్ లో ప్రభుత్వ ఖానిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ
ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని అందుకుగాను సాండ్ బజార్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
సాండ్ బజార్ ల ద్వారా ప్రజలకు తేలికగా ఇసుక లభిస్తుందని, స్టాక్ పాయింట్ల వద్ద 800 చెల్లిస్తే ఇసుక ఇంటికే వస్తుందని తెలిపారు.
అదేవిధంగా ఇసుక దోపిడీని, దళారీ వ్యవస్థను అరికట్టేందుకు సాండ్ బజార్ లు దోహదపడుతాయని తెలిపారు.
స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక తరలించడానికి లారీలు అందుబాటులో ఉంటాయని, ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ప్రజపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఇదివరకే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాండ్ బజార్ లు ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని అవి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు.
కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ
జగిత్యాల ప్రాంతం వారు సాండ్ బజార్ లను సద్వినియోగం కలెక్టర్ బి. సత్యప్రసాద్ చేసుకోవాలని కోరారు. జిల్లాలో కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం ఏరియాలో మాత్రమే ఇసుక రీచ్ లు ఉన్నందున జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఇసుక కొనుగోలు చేయడం భారంగా మారిందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో ముడున్నర ఎకరాల్లో ఇసుక బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
అనుమతులు లేని ఇసుక అక్రమ రవాణపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో....
జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
టిజిఎండిసి జనరల్ మేనేజర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ బిఎస్. లత, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, ప్రాజెక్ట్ అధికారి వినయ్, మరియు సంబందిత అధికారులు
పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
