దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి
బి బి కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లీడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, డీఎస్పీ రఘుచందర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
నేటి యువత భారతదేశంలో 54 కోట్లకు పైగా ఉన్నారని దానికిగాను వీరిని అన్ని రంగాలలో నేటి సమాజానికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంతా కుమారి అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మోడల్, కళాశాల విద్యార్థుల సమక్షంలో లీడ్ ఇండియా,బి బి కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో "యూత్ ఓరియంటేషన్ ప్రోగ్రాం " జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత,మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి, జగిత్యాల డిఎస్పి రఘు చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బి బి కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీడ్ ఇండియా శిక్షణ తరగతులు యువతను ప్రేరేపించడానికి కృషి చేయడం అభినందనీయం అన్నారు. అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ ప్రస్తుతం యువత సెల్ఫోన్ మోజులో పడి సమయాన్ని వృధా చేస్తున్నారని, ఒక లక్ష్యం లేకుండా జీవిస్తున్నారని దీంతో జీవితాలు విచ్ఛిన్నమై సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోతున్నారన్నారు. కాంత కుమారి మాట్లాడుతూ చిన్న వయసులోనే లక్ష్యం ఏర్పరచుకొని దానికి అనుగుణంగా చదువుకొని నైపుణ్యాలు నేర్చుకొని ప్రతిరోజు దానిని మనం చేస్తూ జీవితాన్ని సాఫల్యత చేసుకోవాలని సూచించారు.
డిఎస్పి రఘు చందర్ మాట్లాడుతూ ప్రస్తుతం యువతీ, యువకులు చిన్న వయసులోనే డ్రగ్స్ కు అలవాటు పడి విలువైన జీవితాన్ని సమయాన్ని వారు చేతులారా నాశనం చేసుకుంటున్నారు అన్నారు. లీడ్ ఇండియా సమన్వయకర్త తాడూరి శ్రీనివాస ఆచార్య మాట్లాడుతూ లీడ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా నేటి యువతను సమాజంలో గొప్పవారిగా తీర్చిదిద్దడానికి మానసిక శారీరక అంశాలను వారిని గొప్ప వారిగా తయారు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. బి బి కే ఫౌండర్, చైర్మన్ బొమ్మెన కుమార్ మాట్లాడుతూ యువతకు మంచి అంశాలను బోధించడం తో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి బి బి కే ఫౌండేషన్ నిరంతర కృషి చేస్తుందన్నారు. భవిష్యత్తులో మరెన్నో సామాజిక సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఈవో నారాయణ, తహసిల్దార్ మహమ్మద్ జమీరుద్దీన్, ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి, ఎంపీ ఓ సురేష్ రెడ్డి, జిల్లా లీడ్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ వంశీకృష్ణ, కళాశాల, మోడల్ ప్రిన్సిపల్ ఏనుగు మల్లయ్య, సుంకే రవి, హైదరాబాద్ లీడ్ ఇండియా శిక్షకులు యాట సురేందర్, పత్యం శ్రీనివాస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
