నిరంతర ఉద్యమజీవి, ప్రజాకవి కాళోజీ
భీమారం సెప్టెంబర్ 9 ( ప్రజా మంటలు)
నిరంతర ఉద్యమజీవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారని తెలుగు భాష రాష్ట్ర రిసోర్స్ పర్సన్ రచయిత కటుకోజ్వల మనోహరాచారి అన్నారు.మండల కేంద్రమైన భీమారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు తెలంగాణ భాషా దినోత్సవము గా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాళోజి నారాయణరావు జీవిత విశేషాలు తెలియజేశారు. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. తెలుగును మరచిపోతే మనల్ని మనం మరిచిపోయినట్లేనని తెలుగు మన కంటి వెలుగని ఎన్ని భాషలు నేర్చినాతప్పులేదు కానీ మాతృభాషను మరవడం నేరమని విద్యార్థిని విద్యార్థులు తెలుగు చక్కగా రాయడం చదవడం నేర్చుకోవాలని సూచించారు.
తెలుగులోనే కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలు ఉన్నాయని మన అక్షరాల కూర్పు అందంగా గుండ్రంగా ఉంటుందని అక్షరాలన్నీ చదువుల తల్లి సరస్వతి రూపమని స్వ భాషను నేర్చుకొని ఉన్నత స్థితికి చేరవచ్చని ఐపీఎస్, ఐఏఎస్ లు కూడా సాధించవచ్చని తెలిపారు .
పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ కవుల పరిచయాలను పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్ని ఘనంగా ప్రదర్శించారు.
తెలుగు బోధకులు చెరుకు సంధ్యారాణి,పుష్పలత లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జవ్వాజి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు భాషను స్పష్టంగా నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధిస్తారని తెలిపారు. తెలుగు ఉపాధ్యాయులు చెరుకు సంధ్యారాణి, పుష్పలత లు కాళోజీ నారాయణరావు తెలంగాణ యాస కు,భాషకు చేసిన సేవల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జి.వెంకటరమణ,ఎఎపిసి చైర్మెన్ సరోజ,ఉపాధ్యాయులు శ్రీధర్, ప్రసాద్ ,నరేందర్ , రమేష్, తిరుమల, నీలిమ, రాణి, నాజిమా ,జయశ్రీ, నవ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
