డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
డేటింగ్ యాప్‌లో మహిళా డాక్టర్‌తో పరిచయం పెంచుకున్న యువకుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ నాటకం ఆడి, ఆమె నుండి ₹25 లక్షలు తీసుకొని, పెళ్ళి పేరెత్తగానే ఉడాయించిన ఘటన సికింద్రాబాద్ లోని అల్వాల్ లో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:-
గత సం. ఒక డేటింగ్ యాప్ లో పరిచయమైన యువకుడు, అల్వాల్ లోని డాక్టర్ యువతి పరిచయం అయింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం (32) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వారి పరిచయం ప్రేమగా మారింది.
ఆ పరిచయం కాస్తా, ప్రేమగా మారి, ఇద్దరు దగ్గరయ్యారు. పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ మధ్య కాలంలో అవసరాలు అంటూ చెప్పిన ఆ యువకున్ని నమ్మి, విడతలవారీగా రూ. 25 లక్షల నగదు, 15 తులాల బంగారం ఇచ్చింది,
సుబ్రహ్మణ్యం, తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ వైద్యురాలు, పలు దఫాలుగా అతనికి రూ. 25 లక్షల వరకు ఇచ్చారు. కేవలం ఆమె మాత్రమే కాకుండా, ఆమె తల్లి కూడా సుబ్రహ్మణ్యం మాటలను విశ్వసించి 15 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చారు.
తనతో పెళ్లి ప్రస్తావన తేగానే బ్లాక్‌మెయిల్‌కు దిగిన నిందితుడు, ప్రైవేట్ ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగి, ఇచ్చిన డబ్బులు మరిచిపోవాలని బెదిరింపులకు దిగాడు.
బాధితురాలు పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో సుబ్రహ్మణ్యం అసలు స్వరూపం బయటపడింది. పెళ్లికి నిరాకరించడమే కాకుండా, ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను తన ఫోన్ నంబర్ మార్చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు, అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
