డాక్టర్ గొల్లపల్లి గణేష్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు.
రామ కిష్టయ్య సంగన భట్ల - సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్
జగిత్యాల సెప్టెంబర్ 08 (ప్రజా మంటలు) :
ధర్మపురి కేత్రానికి చెందిన బహుముఖ సేవా తత్పరుడు డాక్టర్ గొల్లపల్లి గణేష్ ను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. విద్యారంగంలో గణేష్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందుకోనున్న సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సమాజ సేవకులు మిత్రులు హితులు, సన్నిహితులు ఆయనను అభినందించారు.
ధర్మపురి క్షేత్రానికి చెందిన డాక్టర్ గొల్లపల్లి గణేష్ ప్రభుత్వ పాఠశాలలో, చైతన్య భారతి ప్రైవేటు పాఠశాలలో, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదివారు.
పట్టభద్రునిగా అత్యుత్తమ మార్కులు సాధించిన నేపథ్యంలో 2003 సంవత్సరానికి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం పొందారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో స్నాతకోత్తర విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఉస్మానియా తెలుగు శాఖ నుండి ”అంతర్జాలంలో తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం ” అనే అంశంపై పరిశోధన గావించిన తనకు డాక్టరేట్ ప్రదానం చేసారు.
2008 డియస్సీ ద్వారా తెలుగు భాషా పండితునిగా, ఉద్యోగంలో చేరి, బీర్పూర్ మండలం తాళ్ళ ధర్మారం లో పదోన్నతి ద్వారా పోస్టింగ్ పొంది, ప్రస్తుతం ధర్మపురి క్షేత్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉపాధ్యాయునిగా అందించిన సేవలకు 2021 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
ఇక సామాజిక సేవా విషయానికి వస్తే...
2016 సంవత్సరంలో పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించాలానే తపనతో ఉద్దేశ్యంతో విద్యార్థి దత్తత కార్యక్రమం (Student Adoption Program) చేపట్టారు.
ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, బీర్‌పూర్ మండలాల్లోని సుమారు 3000 మంది నిరుపేద విద్యార్థులకు ₹20 లక్షల పైగా విలువ గల, సంవత్సరానికి సరిపడే స్టేషనరీ సామాగ్రి (బ్యాగు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిల్‌లు తదితర) అందించారు.
6 గురు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కొరకు దాతల సహకారంతో ఆర్థిక తోడ్పాటు అందించారు. ముగ్గురు విద్యార్థులు బిటెక్ చదువుతుండగా, ఒక విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటిలో, మరో విద్యార్థిని కరీంనగర్ లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారు.
సన్నిహిత మిత్రులతో వుయ్ హెల్ప్ యు అనే సంస్థ 2012లో ఏర్పాటు చేసి, తద్వారా ఆరోగ్యం, విద్య కు సంబంధించిన అవసరాలు ఉన్న వారికి ఆర్థిక సహాయం, ఉన్నత చదువుల కొరకు తోడ్పాటు అందిస్తున్నారు. ఆర్థిక సాయం అందించారు.
కరోనా కష్టకాలంలో దాతల సహకారంతో సుమారు 300 నిరుపేద కుటుంబాలకు ₹1000 విలువ గలిగిన నిత్యావసర సామగ్రి కిట్ల పంపిణీ. ప్రజల అవసరార్థం ” మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ” మిషిన్ ల కొనుగోలు చేశారు.
ధర్మపురిలో వరదలలో దెబ్బతిన్న సుమారు 380 కుటుంబాలకు దాతల సహకారంతో ₹4 లక్షల విలువైన దుప్పట్లు, చాపల పంపిణీ చేశారు.
సేవా కార్యక్రమాలలో , విద్యా బోధనలో సాటిలేని మేటి గా గుర్తింపు పొందిన గొల్లపల్లి గణేష్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రహిస్తున్న సందర్భంలో ధర్మపురి క్షేత్ర ఆబాల గోపాలం ఆయనను అభినందన వెల్లువలో ముంచెత్తింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
