స్వాతంత్రదినోత్సవం సందర్భంగా డాగ్ స్క్వాడ్, బి డి టీమ్ ప్రత్యేక తనిఖీలు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
జగిత్యాల ఆగస్టు 12 (ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ఈ క్రమంలో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్ ఆధ్వర్యంలో జగిత్యాల, కోరుట్ల మెట్ పల్లి లో ప్రధాన ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రజా రవాణా కేంద్రాలు, సమావేశ ప్రాంగణాలు, ముఖ్య రహదారులు, వంతెనలు మరియు పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అనుమానాస్పద వాహనాలు, సంచులు, పార్సెల్లు, వదిలివేసిన ప్యాకేజీలు మరియు అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రతి ప్రాంతాన్ని సిస్టమేటిక్‌గా తనిఖీ చేసి,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం జరుగుతోంది. ప్రజలు కూడా అపరిచిత వస్తువులు లేదా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా 100 నంబర్ కి సమాచారం ఇవ్వాలి అని ఎస్పి అని సూచించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా, భద్రత గా జరిగేందుకు పోలీసులు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)