ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలకు దూరం.
సెక్యూరిటీ లేకుండా రాష్ట్ర మంత్రులు ఎందుకు తిరగడం లేదు..
బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి.
సికింద్రాబాద్, సెప్టెంబర్ 08 (ప్రజా మంటలు):
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా బిజెపి రాష్ట్ర నాయకులు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ల భాగోతాన్ని బయటపెట్టి బట్టలు ఊడదీస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి,సీతక్క, కొండా సురేఖలు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మంత్రులు గుర్తె రగాలని అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ముస్లింల మెప్పుకోసం బీసీల ముసుగులో 10% రిజర్వేషన్లు కల్పించి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని బీసీల నుండి ముస్లింలను తొలగిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించే బాధ్యత మాదేనని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయులు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే బీసీ రిజర్వేషన్ ముసుగులో కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతుందని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ గారిని సెక్యూరిటీ లేకుండా వస్తావా అని ప్రశ్నించిన పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర మంత్రులు వారి పర్యటనల సందర్భంగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి దేవుళ్ల పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే బిచ్చగాలని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ముస్లింల ఓట్ల కోసం ఎందుకు తహతలాడుతున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయనందున ప్రజాక్షేత్రంలో దోషులుగా మిగిలిపోతామనే భయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ పార్టీపై బురదజల్లెందుకు అవాకులు చవాకులు పేల్చుతుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకులు, మంత్రులను సెక్యూరిటీ లేకుండా తిరగకుండా చేయడానికి యూరియా కోసం ఇబ్బందులు పడే రైతులు చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాన్వి అనూష, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
