ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్
శస్త్రచికిత్స లేకుండా ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యకు విప్లవాత్మక చికిత్స
సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) :
తూర్పున ఫిలిప్పీన్స్ నుంచి పడమరలో టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో, తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా కిమ్స్ హాస్పిటల్స్ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ చికిత్సను డే కేర్ విధానంలో నిర్వహించారు.
ఇప్పటివరకు బహ్రెయిన్, దుబాయ్, మారిషస్‌లకు చెందిన ముగ్గురు విదేశీయులు సహా 13 మంది రోగులను విజయవంతంగా చికిత్స చేయడం ద్వారా, భారత వైద్య రంగంలో పెరుగుతున్న అంతర్జాతీయ ఖ్యాతి, వైద్య నైపుణ్య ప్రాముఖ్యతను కిమ్స్ ఆసుపత్రులు మరోసారి నిరూపించాయి. ప్రోస్టేట్ క్యాన్సర్‌మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలు ఇటీవలి కాలంలో పురుషుల్లో వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా వీటి కోసం క్లిష్టమైన శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అయితే, ఒక ముఖ్యమైన పురోగతిగా కిమ్స్ ఆసుపత్రులు తుల్సా-ప్రో (ట్రాన్స్‌యూరేథ్రల్ అల్ట్రాసౌండ్ అబ్లేషన్ ప్రోస్టేట్) సిస్టమ్‌ను పరిచయం చేశాయి. ఇది విప్లవాత్మకమైన ఎంఆర్ఐ మార్గదర్శకత్వం కలిగిన అల్ట్రాసౌండ్‌ఆధారిత చికిత్సా విధానం.
ఈ చికత్స ద్వారా ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండా ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆగ్నేయాసియాలో ఇదే మొట్టమొదటిగా నిలిచింది. మంగళవారం కిమ్స్ ఆసుపత్రుల ఛైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు ఈ అత్యాధునిక పరికరాన్ని ప్రారంభించారు. ఇటువంటి ప్రపంచ స్థాయి సాంకేతికతను భారతదేశానికి పరిచయం చేయడంలో తాము గర్వంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, “కిమ్స్‌లో మా రోగులకు ప్రపంచంలోని తాజా వైద్య విధానాలను చేరవేయడంలో కట్టుబడి ఉంది. తుల్సా-ప్రోతో, ఇప్పుడు మేము ప్రోస్టేట్ చికిత్సలో సంపూర్ణ సేవలను అందిస్తున్నాం. ఇందులో సాంప్రదాయ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, రోబోటిక్ విధానాలు, అలాగే ఇప్పుడు ఎటువంటి కోతలు అవసరం లేని చికిత్సలు ఒకే చోట లభిస్తాయి అని తెలిపారు. అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న రోగులకు అందించే వైద్య నైపుణ్యం, సేవల ప్రయోజనాలను కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు వివరించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ యూరాలజీ మరియు శస్త్రచికిత్స బృందంలోని ప్రముఖులు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, డాక్టర్ కె.వి.ఆర్. ప్రసాద్, డాక్టర్ నీల్ నరేంద్ర త్రివేది తదితరులు హాజరయ్యారు.తుల్సా-ప్రోను పరిచయం చేయడంతో, కిమ్స్ ఆసుపత్రులు ప్రోస్టేట్ చికిత్సలో ఆసియా వ్యాప్తంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాయి. ఇది సాంప్రదాయ శస్త్రచికిత్సకు సురక్షితమైన, ప్రభావవంతమైన, ప్రపంచ స్థాయి ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)