ఉన్నది ఒక్కటే జిందగీ... బలవన్మరణాలు వద్దు...

On
ఉన్నది ఒక్కటే జిందగీ... బలవన్మరణాలు వద్దు...

IMG_20250909_190950 డాక్టర్. వై. సంజీవ కుమార్, 
ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్, 
9493613555,   9393613555.

రేపు ప్రపంచ ఆత్మహత్యల నివారణ రోజు (సెప్టెంబర్ 10వ తేది)

సికింద్రాబాద్, సెప్టెంబర్ 09 ( ప్రజామంటలు):

సమస్యలు మనిషికి కాకపోతే మరెవరికి వస్తాయి అనే ఆలోచన వస్తే జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచననే కలుగదు. ఉన్నది ఒక్కటే జిందగీ, జీవిస్తున్న జీవితమే, ఆర్థిక, వ్యక్తిగత, మానసికవేదనకు, క్షోభతో ఇలా అనేక  కారణాలతో  క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని, ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా  మీ జీవితమే కోల్పోకుండా, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతుంది. నేటి ఆధునిక పోకడతో చిన్న, పెద్దా అనే తారతమ్యం లేకుండా చదువులేనివాళ్ళు, చుదువుతూ ఉన్నవాళ్లు, ఉన్నతమైన స్థానాలలో ఉన్నవాళ్లు సైతం బలవర్మరణాలకు పాల్పడుతున్నారు, మరికొందరు బెట్టింగ్, జూదం, డ్రగ్స్, ఇతర  వ్యసనాలకు బానిసలుగా మారి శారీరకంగా నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా  చితికిపోతున్నారు, పర్యావసనంగా తనువు చాలించాలి అనే ఆలోచనలకు వెళ్లిపోతున్నారు. ప్రేమ విఫలం అని, ఉద్యోగం రాలేదని, ఉద్యోగం పోయిందని, కుటుంబ తగాదాలు అని ఇలా అనేక రకాల కారణాలు చెప్తూ మృత్యువును కోరుకుంటున్నారు. ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన మీరు ఒంటరి కాదు, మీకు మీరు ఉన్నారు, మరోపక్క మీ శ్రేయోభిలాషులు, బంధువులు ఎందరో ఉన్నారు, వారి గురించి ఒక్కసారి ఆలోచించు. ప్రేమ జీవితం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆర్థికంగా నష్టపోయినంత మాత్రాన మీరు చేవలేని, చాతకాని వాళ్ళు కాదు, ఒకదాంట్లో నష్టం వస్తే మరో మార్గం, కుదరకపోతే చిన్న ఉద్యోగం చేస్తూ కూడా దర్జాగా బ్రతికేయొచ్చు, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ప్రాణం తీసుకుంటే పోయేది నీ ప్రాణమే, వాళ్ళది కాదు. చేతకాక చనిపోయారు అనే అపవాదు కూడా చనిపోయాక మోయాలి, అది మీ కుటుంబసభ్యులకు సైతం తీరని లోటు అవుతుంది, వ్యసనాలు అని తెలిసి కూడా అలవాటు చేసుకోవడం ముమ్మాటికీ తప్పు మీదే అవుతుంది, ఎవరో బలవంతం చేస్తే, ఎవ్వరి ఆనందం కోసమో మీరు ఈ దురలవాట్ల రొంపిలో దిగితే కూరకపోయేది మీరే, మీరే తప్పటకుడు వేస్తె మీ కుటుంబంలో ఎవ్వరికి మంచి చెప్పగలరు. వ్యసనాలకు అలవాటు చేసే ఎవ్వరైనా వాళ్ళు మీ ఆప్తులు కాదు అని గ్రహించండి, వాళ్ళు చెడ్దయిందే కాకుండా మిమ్మల్ని తప్పుడు మార్గాలలో తీసుకెళ్తున్నారు అనేది మొదట్లోనే గ్రహించండి. అలాంటి స్నేహాలు, బంధాలు ఏవైనా విదిలించుకోండి, మిమ్మల్ని మీరు గెలవండి.  మీరు వేసే ఒక్క చిన్న తప్పట్టడుగు జీవితాన్నే తారుమారు చేస్తుంది. ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని ఆలోచిస్తే మీ నిర్ణయం ఎంత అసహ్యించుకునేదో మీకే అర్థం అవుతుంది. మీరు ఎంత పెద్ద తప్పు చేయాలనుకున్నారో అర్థం అవుతుంది. చుట్టూ ఉండే జీవితాలను గమనించండి, ఎందరో ఎన్నో కష్టాలు, నష్టాలు బాధలు పడుతూ, అనేక సమస్యలను ఎదుర్కొంటూ, ఎదురయ్యే సమస్యలకు ఛాలెంజ్ విసురుతూ విజయం వైపు పయనిస్తున్నారు, ఉన్నంతలో సర్దుకుపోతూ జీవితాలను వెళ్లబుచ్చుతున్నారు. వాళ్లకు ఉండే సమస్యలలో మీ సమస్య ఎంత ? ఆర్థిక నష్టం అనేది పరిస్థితుల ప్రభావంలో సహజం, అంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోతాయా ? మీరు పిరిగివాళ్లుగా మిగిలిపోతారు. ప్రేమలో విఫలమైదని జీవితాన్ని ముగించేనుకుంటే మరి మీ ప్రేమ కన్నా మీ కన్నా వాళ్ళ ప్రేమ చిన్నదా ? వారి జీవితాలు ఎం అవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా ? వివాహానికి ముందే ప్రేమ విఫలం అయినందుకు సంతోషపడాలి, ఇంకా మీ చేతిలో చాల సమయం ఉంది, చెడు జ్ఞాపకాలను ముగించేసి సరికొత్త ఆలోచనలతో, నూతన జీవితానికి పునాది వేయాలి. సరికొత్త జీవితాన్ని ప్రారంభం చేసి మీరు ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉంటుంది.  ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని, కష్టాలు ఎదుర్కొని మనచుట్టూ ఉండే వారిని సంతోషపెట్టాలి.  ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి ఓటమి ఒక మెట్టే,  మారుతున్న కాలానికి తగ్గట్లుగా దైర్యంగా ముందుకు సాగండి, గెలుపుమార్గాలు ఎదురవుతాయి. ప్రేమ, పెళ్లి, వ్యాపారం, ఉద్యోగం, ఉన్నత చదువులు, బంధాలు ఏవైనా జీవితంలో ఒక భాగం మాత్రమే అవే జీవితం కాదు అనే సత్యాన్ని గ్రహిస్తే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన కూడా రాదు. జీవితం చాల విశాలమైనది,, ఒకటి కాకపోతే మరొకటి మనస్సును విశాలం చేసుకుంటే ప్రపంచం చాల పెద్దగా కనిపిస్తుంది, అనేక మార్గాలు బ్రతకడానికి, మీ గెలుపు లక్ష్యం ఏమిటో కూడా మీకు బోధపడుతుంది. 

 

Tags

More News...

Local News 

గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి చీఫ్‌ ఫార్మసీ ఆఫీసర్‌గా వేణుగోపాల్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఉస్మానియా ఆస్పత్రి ఫార్మసీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై గాంధీకి బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన 1990లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. బొల్లేపల్లి, భువనగిరి, బొమ్మల రామారం, ఉస్మానియా ఆస్పత్రుల్లో వివిధ...
Read More...
Local News 

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు 

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు  (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 10  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని బుధవారం చిల్వకోడూరులో జరిగిన మండల స్థాయి ఆటల పోటీలలో బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు పాల్గొన్ను ఎస్ .లక్ష్మినివాస్, బి .ఆశ్రిత్, ఎస్ .నిశాంత్ ,కె .హర్షవర్ధన్ జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను...
Read More...
Local News 

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం  - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం  - అడిషనల్ డీఎంఈ వాణీ ఆకస్మికంగా గాంధీ ఆసుపత్రి సందర్శన సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) : కార్పోరేట్‌ ఆస్పత్రులకు తీసిపోని విదంగా  సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిని తీర్చిదిద్ధి బ్రాండింగ్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుపుతామని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డీఎంఈ ప్రొఫెసర్‌ వాణి అన్నారు. హెల్త్ మినిస్టర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆమె బుధవారం గాంధీఆస్పత్రిని ఆకస్మికంగా...
Read More...
Local News 

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి 

 దేశానికి వెన్నెముక యువత బి బి కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లీడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, డీఎస్పీ రఘుచందర్   (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): నేటి యువత భారతదేశంలో 54 కోట్లకు పైగా  ఉన్నారని  దానికిగాను వీరిని అన్ని రంగాలలో నేటి సమాజానికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అడిషనల్...
Read More...
National  State News  Crime 

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా! హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): డేటింగ్ యాప్‌లో మహిళా డాక్టర్‌తో పరిచయం పెంచుకున్న యువకుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ నాటకం ఆడి, ఆమె నుండి ₹25 లక్షలు తీసుకొని, పెళ్ళి పేరెత్తగానే ఉడాయించిన ఘటన సికింద్రాబాద్ లోని అల్వాల్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:-  గత...
Read More...
National  State News 

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్ 

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్  హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): ఎమ్మెల్యే రాజాసింగ్‌ కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను..ఏం చేస్తారు, కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం అని బీజేపీకి సవాలు విసిరారు. పార్టీ కోసం పని చేయడానికి...
Read More...
Local News 

కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి  మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి   మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు      17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర పథకాలపై అవగాహనాజగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)  _సేవా  పక్వాడ జిల్లా స్థాయి కార్యశాలలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు_  జగిత్యాల, సెప్టెంబర్ 10: కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ చేపడుతున్న జనామోధిత పథకాలపై ప్రజలకు అవగాహనను పెంచుతూ గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చాలని...
Read More...
Local News 

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి 

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి  సికింద్రాబాద్,  సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): రామంతపూర్ ప్రగతి నగర్ లో చాకలి ఐలమ్మ  40వ వర్ధంతి సందర్భంగా రజక నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు.రజకుల సంఘం నాయకులు మొగిలి కృష్ణయ్య ,మోరపాక సతీష్ లు మాట్లాడుతూ... భూమికోసం,  భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసంతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన వీర...
Read More...
Local News 

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):    ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం సైకియాట్రి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కళాశాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర  ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదని ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సమాజంలో...
Read More...
Local News 

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం.  జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)ఇసుక బజార్' లను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం జిల్లాకేంద్రంలోని వాణినగర్ లో ప్రభుత్వ ఖానిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ   ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేసాండ్...
Read More...
Local News 

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం రచయిత లతా పేష్కర్ ను సత్కరించిన ట్రస్మా సికింద్రాబాద్  సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): లతా పేస్కర్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ట్రస్మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ ను ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమామహేశ్వరరావు...
Read More...
Local News 

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

75000/ వేల రూ జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ అరవింద్ నగర్ కి చెందిన శివరాత్రి రామ్ చరణ్ కుడి చేతి శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో 75000 వేల రూపాయల  ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...