కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు
17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర పథకాలపై అవగాహనా
జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
_సేవా పక్వాడ జిల్లా స్థాయి కార్యశాలలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు_
జగిత్యాల, సెప్టెంబర్ 10:
కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ చేపడుతున్న జనామోధిత పథకాలపై ప్రజలకు అవగాహనను పెంచుతూ గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చాలని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు కోరారు.
బుధవారం సేవా పక్వాడ జిల్లా స్థాయి కార్యశాల స్థానిక ఓ ఫంక్షన్ హలులో జరుగగా జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా యాదగిరి బాబు మాట్లాడుతూ కేంద్రములోని మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండో సారి ప్రజా సంక్షేమమే విధిగా పనిచేసున్నాడన్నారు. కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్న పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహనా కల్పించాల్సిన అవసరం ప్రతి కార్యకర్త పై ఉందన్నారు.
ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు గడప గడప కు కేంద్ర పథకాలను తీసుకొనిపోవాలని అన్నారు. నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి నియోజకవర్గలో రక్త ధాన శిభిరాలను నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్, బికిస్త భారత్ అంశాలపై మహిళా మోర్చా సారథ్యంలో చిత్ర లేఖన పోటీలతోపాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
20 న బూత్ స్థాయిలో మొక్కలు నాటి దీన్ దయాళ్ జికి నివాళులు అర్పించాలన్నారు.
21 న నమో మోరతాన్ నిర్వహించి విద్యార్థులను భాగస్వాములను చేయాలని కోరారు. 27 న దివ్యాంగులను సన్మానించి, ఉపకరణాలను పంపిణి చేయాలన్నారు. 28 న పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలను సన్మానించి, ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యాదగిరి బాబు పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శులు వడ్డే పల్లి శ్రీనివాస్, నలువాల తిరుపతి, పిల్లి శ్రీనివాస్, కన్నం అంజయ్య, ఎర్ర లక్ష్మి, సదాశివ్, జిల్లా సేవ కన్వీనర్ సత్య నారాయణ, దశరథ రెడ్డి, దివాకర్ తోపాటు పలువురు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
