గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం
₹20 లక్షల విలువైన పరికరాలు దానం చేసిన ప్రొఫెసర్ పద్మావతి రాఘువేంద్రరావు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 ( ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాతగా ముందుకు వచ్చిన ప్రొఫెసర్ పద్మావతి రఘువేంద్రరావు రూ.20 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ను అందించారు. వీటిలో సీ–ఏఆర్ఎమ్, ఓటీ టేబుల్, ఓటీ లైట్,పేషెంట్ మానిటర్ వంటి పరికరాలు ఉన్నాయి. అలాగే 2023 బ్యాచ్ పీజీ విద్యార్థులు కూడా రూ.1 లక్ష విలువైన వైద్య పరికరాలను దానం చేశారు. అంతకుముందు జీఎంసీ జీఏ తరపున ఒక యూఎస్జీ మెషిన్ డొనేట్ చేశారు. దీంతో ఏప్రిల్‌లో ప్రారంభమైన పెయిన్ క్లినిక్ ఇప్పుడు పూర్తిస్థాయి పరికరాలతో రోగులకు సేవలు అందించడానికి సిద్ధమైందని అనస్తిషీయా హెచ్ఓడీ డాక్టర్ ఆవుల మురళీదర్ తెలిపారు. ఈ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం ద్వారా గాంధీ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిర,సూపరింటెండెంట్ డా.రాజకుమారి లు తెలిపారు.కార్యక్రమంలో ఆర్ఎంవోలు డా.శేషాద్రి,డా.కళ్యాణచక్రవర్తి,డా.సుబోధ్,డా.మాదాల కిరన్,డా.అబ్బయ్య,డా.రవి, డా.ఉపేందర్ గౌడ్, వైద్యులు, పీజీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
