ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా
పార్టీ ద్రోహులు హరీశ్, సంతోష్ లు- వారి వల్లే రేపు పార్టీకి నష్టం- కవిత
హరీష్ రావు వల్లే జగ్గారెడ్డి,విజయశాంతి, డా.విజయరామారావు, ఈటెల పార్టీ వీడారు - కవిత
రేవంత్ రెడ్డి తో కుమ్మక్కు - అందుకే వీరిపై కేసులు ఉండవు
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎవరు? సంతోష్ రావు క్లాస్మెంట్ అందుకే వీటి అవినీతిపై కేసులు లేవు
మహిళా నాయకులు నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ - స్వాగతం
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ, పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, తనపై, పార్టీ పెద్దలైన కేసీఆర్, కేటీఆర్ పై హరీష్ రావు, సంతోష్ రావు లు చేసిన కుట్రలను, చేసిన పార్టీ వ్యతిరేక పనులను సవివరంగా వెల్లడించారు.
తీహార్ జైలు నుండి వచ్చిన వెంటనే, గురుకులంలో విద్యార్థి చనిపోతే వెళ్లిన, బనకచర్లపై, బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశా. గత నవవంబర్ నుండి నిన్నటి వరకు 47 నియోజక వర్గాలలో, పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకొంటూ, భవన్ ఇంచార్జీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తో మాట్లాడుతూ, నియోజకవర్గ కార్యకర్తలతో,నాయకులతో కలిసి కార్యక్రమాలు చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాల అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
తెలంగాణ భవన్ కు వెళ్లి అక్కడ 103 రోజుల క్రితం నాపై కొంత మంది చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నట్లు చెప్పినా, వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న నుండి ఫోన్ అందించాను. కానీ ఇప్పటి వరకు స్పందనలేదు. కానీ నా ప్రెస్ మీట్ పై పార్టీ మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం మంచిదే. అదే నేను ఆశించిన ప్రజాస్వామ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని కవితే అన్నారు.
మొన్నటికి మొన్న, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో అంతకాగుతు, సంఖ్యాబలం లేకున్నా, BRS పార్టీ నుండి రెండవ అభ్యర్థిని పెట్టాలని కేసీఆర్ పై వొట్టి కొట్టాడు. నాకు ఒక బీజేపీ ఎమ్మెల్యే పాన్ చేసి ఈ హరీష్ మాతో ఒప్పందం చేసుకొని, BRS నుండి రెండవ అభ్యర్థిని పెడతానంటున్నాడు, మాసయం కోరాడు.దీనికి పెద్దవారు అంగీకరించడా అని అడిగాడు. నేను ఈ విషయంలో నాన్న కు ఫోన్ చేసి చెపితే, ఆయన నో ఒకే అభ్యర్థి అని గట్టిగా చెప్పడంతో, ఆయమ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఇలా ఆయన పార్టీకి చేసిన ద్రోహాలు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు.
మీడియా మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట.అందుకే ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు ఒకటి రెండు రోజులలో మాయం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి, హరీష్ కుమ్మక్కు అయిందనే, గురుకులాలకు సరఫరాచేసే పాల కుంభకోణం వార్త మాయం అయింది. ఆయన ఫాం హౌస్ వార్తకూడా అంటే. అదే, రామన్న మీద వచి ఆరోపణలపై విచారణ, మీడియాలో రాద్దాంతాలు. ఇది వారి కుట్రలకు, అవగాహనలు ప్రతీకలని ఆమె అన్నారు.
హరీష్ రావు ఎప్పుడూ కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా, తన ప్రత్యేక గ్రూప్ ఉంచుకున్నారు. ఎన్నికల్లో పార్టీకి తెలియకుండా, కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు అదనంగా ఫండింగ్ చేశారు. ఈ డబ్బు ఎక్కడిది? ఇదంతా ఆయన అవినీతి డబ్బులు కావా అని ప్రశ్నించారు.
నేరేళ్ల దళితులపై పోలీసుల దురుసు ప్రవర్తనకు కారణం సంతోష్ రావు, కానీ చెడ్డపేరు రామన్నకు వచ్చిందని అన్నారు.
బ్లూఫిన్ రియాల్టీ సంస్థ కు సంతోష్, పోచంపల్లి బినామీ
మొకిల్లాలో బ్లూఫిన్ రియాల్టీ సంస్థ కు బినామీలు ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గతం ఏమిటో అందరికీ తెలుసు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన పోచంపల్లికి ఇన్నివేల కోట్లు ఎలా వచ్చాయి? వీరంతా సంతోష్ తో కుమ్మక్కై సంపాదించింది కదా? సంతోష్ క్లాస్మెంట్ కాబట్టే పోచంపల్లి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని ఆరోపించారు.
హరీష్ రావు హంపి పార్టీ గురించి, YSR ను కలిసి, పార్టీకి ద్రోహం చేయాలని కొన్న విషయం సీనియర్ పాత్రికేయులందరికీ తెలుసు. అలాగే దుబ్బాక, హుజురాబాద్ ఓడిపోవడానికి ప్రధాన కారణం హరీష్ రావు. సమస్యలు సృష్టించి, పరిష్కరించమని ప్రచారం చేసుకొనే కుట్సిత మనస్తత్వం హరీష్ రావు , పార్టీని కబ్జా పెట్టాలనుకునే ఇలా వ్యవహరిస్తున్నాడని కవిత అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
-overlay.jpg.jpg)
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
