నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
..
మెట్పల్లి సెప్టెంబర్ 1 (ప్రజా మంటలు)
ఎన్పీడీసీఎల్ డి ఈ మనోహర్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరు..
మనోహర్ ను ఘనంగా సన్మానించిన అధికారులు..
ఉద్యోగ బాధ్యతలను నిబద్దతతో క్రమశిక్షణతో నిర్వర్తిస్తే అటు ప్రజలు అటు అధికారుల్లో మంచి గుర్తింపు వస్తుందని దురిశెట్టి మనోహర్ విద్యుత్ శాఖ ఏ డీఈ గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
సోమవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి టీజీ ఎంపీడీసీఎల్ ఏ డీఈ ఎలక్ట్రిక్ సిటీ ఉద్యోగి దురిశెట్టి మనోహర్ ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగింది.
ఖమ్మం కలెక్టర్ గా ప్రస్తుతం పని చేస్తున్న ఐఏఎస్ అధికారి అనుదీప్ మనోహర్ కుమారుడు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ, దురిశెట్టి మనోహర్ తన ఉద్యోగ బాధ్యతలు నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేసి విద్యుత్ శాఖలోనే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన కృషి, అంకితభావం సిబ్బందికి ప్రేరణగా ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రతి ఉద్యోగి తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా, నిర్వర్తించాలని తద్వారా ప్రజల నుంచి మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
విరమణ అనంతరం కూడా మనోహర్ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులకు కొంత సమయం ఇచ్చే అవకాశం లభించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా దొరిశెట్టి మనోహర్ ను జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులు పలువురు అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మనోహర్తో ఉన్న అనుబంధాన్ని విద్యుత్ శాఖ అధికారులు పంచుకున్నారు.
మనోహర్ నిజాయితీతో సేవలందిస్తూ విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారని పలువురు అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారి మనోహర్ కుమారుడు ఐఏఎస్ అధికారి దుర్శేట్టి అనుదీప్, పలువురు అధికారులు, సహోద్యోగులు మరియు బంధువులు పాల్గొని మనోహర్ కు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు
-overlay.jpeg-overlay.png)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు
