జల్సాలకు మరిగి...చైన్ స్నాచింగ్ బాట పట్టిన యువకుడు
చివరికి రైల్వే పోలీసులకు చిక్కిన ప్రైవేట్ ఎంప్లాయి..
77గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ స్వాధీనం
సికింద్రాబాద్, ఆగస్టు 11 (ప్రజామంటలు):
లేనిపోని జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఓ వైపు ప్రైవేట్ జాబ్ చేస్తూనే..ప్రవృత్తిగా బంగారు చైన్ల దోపిడి బాట పట్టి, చివరికి రైల్వే పోలీసులకు చిక్కాడు..అతడి నుంచి రూ7లక్షల 70వేల విలువ చేసే 77 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ డీఎస్సీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...ఏపీ కాకినాడ జిల్లా శంఖవరం మండటం జగ్గంపేట కు చెందిన కోరుప్రోలు లవరాజు(23) గత రెండేళ్ళ క్రితం హైదరాబాద్ కు జీవనోపాధికై వచ్చాడు.
జీడిమెట్ల పరిధిలోని సూరారంలో నివాసం ఉంటూ హెటిరో ల్యాబ్స్లో రూ23వేల జీతంతో జూనియర్ కెమిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో మద్యం, సిగరేట్లు,ఆన్లైన్ బెట్టింగ్గేమ్స్ యాప్ లకు బానిస అయిన లవరాజుకు నెలవారీ జీతం డబ్బులు సరిపోలేదు. ఈ నేపద్యంలో ఓసారి సొంతూరు కు వెళ్ళడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన లవరాజు కు అక్కడున్న జనం రద్దీని చూసి గోల్డ్ చైన్ స్నాచింగ్ స్కెచ్ వేశాడు. స్నాచింగ్ చేస్తే, తన జల్సాలకు అవసరమైన డబ్బును సమకూర్చుకోవచ్చని నిర్ణయించుకున్నాడు. తన స్కెచ్ లో భాగంగా ఫిబ్రవరి 26న సింహపురి ఎక్స్ప్రెస్, ఆగస్ట్ 2న గౌతమి ఎక్స్ప్రెస్లో బంగారపు గొలుసుల చోరి చేశాడు. రైల్వే ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల మేరకు డీఎస్పీ జావెద్, ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్, ఎస్ఐ సుబ్బారెడ్డి లు ఆర్పీఎఫ్ పోలీసులతో కలసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.
సోమవారం ఉదయం 7 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. గతంలో పలు చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మూడు చైన్లను దొంగిలించగా, రెండింటిని విక్రయించిన నిందితుడు ఒక్కదానిని సూరారం ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచీ లో తాకట్టు పెట్టాడు. నిందితుడి వద్ద రూఏడు లక్షల డెబ్బై వేల విలువ చేసే 77గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ ను స్వాధీనం చేసుకొని, నిందితుడు లవరాజును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)