కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా
కవిత ఆరోపణల ఖండన
జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని, ఎప్పుడూ కేసీఆర్ ను తిట్టడంతోనే సరిపోయింది,కామారెడ్డి పర్యటన లో కూడా కేసీఆర్ ను తిట్టడమే పనిగా ఉందని, పని చేసి చూపించలని ..ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బయారెస్ పార్టీ జిల్ల్వలా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు.
జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్, సమైండ్ల శ్రీనివాస్,దేవేంద్ర నాయక్, శివకేసరి బాబు, తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి తన స్వంత డబ్బా కొట్టుకోవడం బంద్ చేసి, రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
ఇచిన హామీలు నెరవేర్చకపోగా, తెలంగాణకు వరదాయిని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ను తప్పుపడుతూ, ఏదో జరిగిపోయిందని ప్రచారం చేసి, ఘోష్ కమీషన్ వేసినా ఏమి తేలక పోవడంతో, సీబీఐ కి అప్పగించి, బీజేపీ చేతిలో కీలు బొమ్మ అని నిరూపించుకున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
ఘోష్ కమిషన్ నివేదిక వీరికి అనుకూలంగా లేదని, సిబిఐ కు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ మంత్రులు కూడా సంతోషంగా లేరని, ప్రజానాయకునికి వ్యతిరేకంగా ఏమిచేసినా, అది వారికే తిరిగికొడుతుందని ప్రజల తరపున హెచ్చరిస్తున్నామని.. అభివృద్ధి దిశలో పయనించలని వారు సీఎం కు సూచించారు.
కవిత ఆరోపణల ఖండన
ఎమ్మెల్సీ కవిత కొన్ని రోజులుగా కేటీఆర్ పై, ఇప్పుడు హరీష్ రావుపై చేసిన ఆరోపణలను వీరు ఖండించారు.
కేసీఆర్ అంటేనే బీఆర్ఏస్ పార్టీ అని.. కేసీఆర్ ని కాదనుకొని వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలుసు అని, కవిత తన భవిష్యత్ ను కాపాడుకోవాలని, బిఆర్ఎస్ ను, పార్టీ నాయకులను విమర్శించడం మానుకోవాలని సలహా ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా
