మల్లాపూర్ మం. నడికుడ జి.పి.లో హక్కుల కమిటీచే రికార్డుల తనిఖీ
త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక
ప్రభుత్వాలు చట్టాలపై అవగాహన కల్పించాలి :
ఎన్.హెచ్.ఆర్.సి. (ఎన్ జివో) డిమాండ్
మల్లాపూర్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామ పంచాయతీ లో గురువారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రికార్డుల తనిఖీ చేశారు. పిర్యాదు దారుడు అప్పం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రికార్డుల తనిఖీలో 2017 నుండి 2025 వరకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లు లు, తీర్మానాలు, జనరల్ ఫండ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తనిఖీల ప్రతినిధులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం -2005 భారత దేశ ప్రజలకు వజ్రాయుధమని అన్నారు. ఈ చట్టాన్ని ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా యువత ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్య క్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారాం, సీనియర్ ఆర్టీఐ ఆక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి, ఎన్ హెచ్ ఆర్ సి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సాతారపు పద్మ - జనార్దన్, జగిత్యాల నియోజక వర్గ ఇంచార్జ్ సంగెపు ముత్తు, జగిత్యాల పట్టణ అధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం
