దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం
On
పౌరాణికులు పురాణం మహేశ్వర శర్మ
(రామ కిష్టయ్య సంగన భట్ల)
దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ అవతార తత్వమని సంస్కృతాంధ్ర పండితులు, సుప్రసిద్ధ పౌరాణికులు, శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణికులు పురాణం మహేశ్వర శర్మ ఉద్ఘాటించారు. క్షేత్రంలో అనురణీయ సాంప్రదాయాచరణలో భాగంగా, భాద్రపద మాస సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సౌజన్యంతో, రామలింగేశ్వరాలయంలో శ్రీ శారదా మహిళా మండలి సహకారంతో నిర్వహిస్తున్న భాగవత సప్తాహ కార్యక్రమ క్రమంలో శుక్ర వారం వారం మహేశ్వర శర్మ తమ ప్రవచనంలో, శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర కలియుగ సంధికాలంలో శుక్ల సంవత్సరంలో, శ్రావణ మాసంలో బహుళ పక్షంలో, రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమినాడు రెండు యామముల రాత్రి సమయాన కారాగారంలో మేనమామ గండాన జన్మించాడని వివరించారు.
తల్లులకు ప్రియమై, మాతృ హృదయాలలో మమతను పొంపొందించేవిగా, కృష్ణుని బాల్య చేష్టలు జ్ఞప్తికి తెస్తాయన్నారు. పాపపుణ్యాల వాసనేలేని బ్రహ్మ స్వరూపపు బాలలలో ద్యోతక మయ్యే దివ్యత్వాన్ని తేట పరిచేది కృష్ణావతార బాల్యమని, యోగీశ్వరుడు, రాజకీయ దురంధరుడు, పరమాత్ముడు, గీతా ప్రవక్తయైన కృష్ణుడు నిర్యాణం చెందిన దినమే కలి యుగ ప్రారంభ దినంగా పేర్కొంటున్నారని వివరించారు.
సర్వాంతర్యామియైన లీలామానస విగ్రహుడైన శ్రీకృష్ణుడు చైతన్య రూపానికి ప్రతి రూపమని, తాను చైతన్య రూపంగా గోచరించి, సర్వ జనులకు భాగవత శ్రవణాదుల ద్వారా ఐహిక, పారమార్థిక సుఖాలను ఉద్ఘాటించారు. శ్రీకృష్ణుని స్మరణ మాత్రం చేతనే ముక్తి లభించగల. దన్నారు. భాగంవత పురాణం మహాజ్ఞానియైన వేదవ్యాసుని ద్వారా విరచించబడి, మహా వైరాగ్య శాలియైన శ్రీశుక యోగీంద్రుని ముఖారవిందం నుండి స్రవించి, మహా భక్తుడైన పరీక్షిన్మహరాజు హృదయమును స్పృషించినదని వివరించారు.
కృష్ణావతారాన్ని, తదంతర్భాగ విషయాలను, కృష్ణావతార మహిమను బాల్య క్రీడలను, రాక్షస సంహారాలు,కంసవధ, కుచేలోపాఖ్యానం,
రుక్మిణీ కళ్యాణం లను సవివరంగా, తాత్విక నేపథ్యాన్ని సోదాహరణంగా, మృదుమధురంగా పండిత పామరులకు అర్థమయ్యే రీతిలో వ్యాఖ్యానం గావించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్
Published On
By From our Reporter

జైలు నుంచి ఖైదీల పరారీ
Published On
By From our Reporter
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్
Published On
By From our Reporter

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు
Published On
By From our Reporter

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు
Published On
By From our Reporter

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం
Published On
By From our Reporter

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ
Published On
By Siricilla Rajendar sharma

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం
Published On
By From our Reporter

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు
Published On
By From our Reporter

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Published On
By From our Reporter

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
Published On
By From our Reporter

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా
Published On
By From our Reporter
