భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు
( రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి సెప్టెంబర్ 03:
సుప్రసిద్ధ గోదావరీ తీరస్థ ప్రాచీన పుణ్య తీర్ధ మైన ధర్మపురి క్షేత్రంలో, భాద్రపద శుద్ధ ఏకాదశి పర్వ దిన వేడుకలను బుధ
వారం సాంప్రదాయ రీతిలో వైభవంగా జరుపుకున్నారు. దీనినే వామన ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు విష్ణువు నిద్రకు ఉపక్రమించి, బాద్రపద ఏకాదశికి రెండు నెలలు అయిన సందర్భంగా పక్కకు ఒత్తిగిల్లు తాడు. ఆ ఒత్తిలడం ఎడమ నుండి కుడికి కనుక దీనిని "పర్శ్వ పరివర్తినేకా దశి" అని కూడా అంటారు.
ఏకాదశి పర్వదిన సందర్భంగా సుదూర ప్రాంతాలనుండి, ఆర్టీసీ బస్సులలో, ప్రైవేటు వాహనాలలో బుధ
వారం ఉదయాత్పూర్వం నుండి శ్రమకోర్చి ఏతెంచిన భక్తులు, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, గోదావరి మాతను పూజించి, మొక్కులు చెల్లించు కున్నారు.
అనంతరం దైవ దర్శనార్ధం దేవాలయాలకు తరలి వెళ్ళారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల, సూపరింటెండెంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ఆర్చక పురోహి తులు బొజ్జా సంతోష శర్మ, సంపత్ కుమార శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, రాజగోపాల శర్మ, దేవాలయాల అర్చకులు విధివిధాన వేదోక్త, పంచోపనిషత్ యుక్త ప్రత్యేక పర్వ దిన పూజలు, నిత్య కళ్యాణాదులను నిర్వహించారు.
ఏకాదశి తిథి పర్వదినాన వివిధ ఆలయాలలో క్షీరాభిషేకాది కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించారు. అశేష భక్తులు ఏకాదశి సందర్భ ప్రత్యేక పూజలలలో పాల్గొన్నారు. బుధవార సహిత ఏకాదశి పర్వదిన సందర్భంలో క్షేత్ర ముత్తయిదువులు ప్రత్యేక వ్రతాలను ఆచరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
-overlay.jpg.jpg)
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
