BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ మద్దతు!
అందరూ అనుకున్నదే అయింది..కవిత మార్గం ఎటు వైపో...
జాగృతి, బిసి నాయకులతో కవిత సమావేశం
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది.నిన్నటి కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో BRS పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు క్రమశిక్షణ కమిటీ, ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన వెలువడక ముందే, కవిత తన ఇంట్లో తెలంగాణ జాగృతి, బిసి మరియు శ్రేయోభిలాషులతో సమావేశం అవుతున్నారు. ఆమె సమావేశంలో ఉండగానే, ఆమెను పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. దీనిపై ఇంతవరకు కవిత ఎలాంటి ప్రకటన చేయలేదు. సాయంత్రం ఆమె పాత్రికల వారితో మాట్లాడ వచ్చునని తెలుస్తుంది.
ఈ ప్రకటనలో ఆమెను ఎన్నాళ్లు సస్పెండ్ చేశారు, ఆమె వ్యాఖ్యలకు కారణాలు ఆడడం, ఆమె వివరణ లాంటి విషయాలు ఏమి ప్రస్తావించకుండానే, నేరుగా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
కొన్నాళ్లుగా పార్టీ వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని, సస్పెండ్ చేసినట్లు BRS నాయకులు తెలిపారు.
నిన్న కల్వకుంట్ల కవిత పత్రికా సమావేశంలో హరీష్ రావు, సంతోష్ రావు పై ఆరోపణ చేసినప్పటి నుండే పార్టీ ఆమె నుండి దూరం అవడం ప్రారంభించారు.
హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత సంచలన ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు కవితను అన్ ఫాలో కొడుతున్నారు. BRS గ్రూప్ నుంచి కవిత PROను తొలగించారు. మరోవైపు హరీష్ రావుకు మద్దతుగా BRS అధికార ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
.jpg)
గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్

BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ మద్దతు!
