ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం
పోస్టర్ ఆవిష్కరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 02 (ప్రజామంటలు) :
ఫిల్మ్, టెలివిజన్ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి సత్కరించడానికి ఎఫ్ టీ పి సి -ఇండియా (ఫిల్మ్ టెలివిషన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్న గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ వేడుకలు ఈ నెల 19న బేగంపేట కంట్రీ క్లబ్‌లో వైభవంగా జరగనున్నాయి. ఈ అవార్డుల వేడుకకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం హైడ్రా ఆఫీస్ లో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇలాంటి అవార్డులు సమాజానికి విశేష కృషి చేసిన వ్యక్తులను ప్రోత్సహించడమే కాకుండా, తదుపరి తరాలకు స్ఫూర్తినిచ్చే వేదికగా నిలుస్తాయని అన్నారు. ఎఫ్ టీ పీసీ ఇండియా చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం అని పేర్కొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎఫ్ టీ పీసీ ఇండియా తెలంగాణ మీడియా చైర్మన్ కిరణ్ బెజాడి, మీడియా డైరెక్టర్ మున్నూరు చందు, బృంద సభ్యులు స్మిత, దీపిక, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు.
అవార్డుల ప్రదానోత్సవానికి సినీ, టెలివిజన్, మీడియా రంగ ప్రముఖులు, సామాజిక రంగంలో విశిష్టమైన సేవలందిస్తున్న పలువురు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఎఫ్ టీ పి సి ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అవార్డులు, హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్‌మెంట్, సోషియల్ సర్వీస్, బిజినెస్, మీడియా, ఫిల్మ్ & టెలివిజన్ వంటి విభాగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులకు ప్రదానం చేయనున్నారని వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
.jpg)
గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్

BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ మద్దతు!
