రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు
రెండు నెలల్లో 54 రాళ్ళ దాడి కేసులు నమోదు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 02 (ప్రజామంటలు) :
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లపై రాళ్లు రువ్విన వారిపై, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర వస్తువులు ఉంచిన వారిపై రైల్వే రక్షణ దళం (ఆర్‌పిఎఫ్) కఠిన చర్యలు చేపట్టింది. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు మొత్తం 54 రాళ్ల దాడి కేసులు నమోదయ్యాయి. వాటిలో 30 కేసులను ఛేదించి 33 మందిని అరెస్టు చేశారు.
ఈ కేసుల్లో ఇంకా 30 మంది పరారీలో ఉన్నారు. అంతేకాకుండా, ట్రాక్‌లపై వస్తువులు ఉంచిన 8 కేసులు నమోదు కాగా, 6 కేసులను ఛేదించి 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులు ప్రస్తుతం సంబంధిత కోర్టులలో విచారణలో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ రైల్వేలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ అన్నారు. ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని, ఎవరు రైల్వే ఆస్తులను ధ్వంసం చేసే చర్యలకు పాల్పడినా 139 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
ఇలాంటి చర్యలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారడంతో పాటు దేశ సంపదకు నష్టం కలిగిస్తాయని, పిల్లలకు కూడా ఈ ప్రమాదాల గురించి తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
.jpg)
గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్

BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ మద్దతు!
