గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం
₹20 లక్షల విలువైన పరికరాలు దానం చేసిన ప్రొఫెసర్ పద్మావతి రాఘువేంద్రరావు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 ( ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాతగా ముందుకు వచ్చిన ప్రొఫెసర్ పద్మావతి రఘువేంద్రరావు రూ.20 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ను అందించారు. వీటిలో సీ–ఏఆర్ఎమ్, ఓటీ టేబుల్, ఓటీ లైట్,పేషెంట్ మానిటర్ వంటి పరికరాలు ఉన్నాయి. అలాగే 2023 బ్యాచ్ పీజీ విద్యార్థులు కూడా రూ.1 లక్ష విలువైన వైద్య పరికరాలను దానం చేశారు. అంతకుముందు జీఎంసీ జీఏ తరపున ఒక యూఎస్జీ మెషిన్ డొనేట్ చేశారు. దీంతో ఏప్రిల్‌లో ప్రారంభమైన పెయిన్ క్లినిక్ ఇప్పుడు పూర్తిస్థాయి పరికరాలతో రోగులకు సేవలు అందించడానికి సిద్ధమైందని అనస్తిషీయా హెచ్ఓడీ డాక్టర్ ఆవుల మురళీదర్ తెలిపారు. ఈ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం ద్వారా గాంధీ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిర,సూపరింటెండెంట్ డా.రాజకుమారి లు తెలిపారు.కార్యక్రమంలో ఆర్ఎంవోలు డా.శేషాద్రి,డా.కళ్యాణచక్రవర్తి,డా.సుబోధ్,డా.మాదాల కిరన్,డా.అబ్బయ్య,డా.రవి, డా.ఉపేందర్ గౌడ్, వైద్యులు, పీజీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
