సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా
కొత్తగూడెం సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మిర్యాల రాజి రెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, జనరల్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బదవత్ శాంత, వనమా రాఘవ పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలు వెల్లడించడంతోపాటు 35% వాటా ప్రకటించి మరియు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం అసాధారణ జాప్యం చేస్తున్నది.
పెరిగిన రాజకీయ జోక్యం - కొప్పుల ఈశ్వర్
సింగరేణి సంస్థలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, కార్మికుల రక్షణ, సంస్థ ఆస్తులను కాపాడుతూ కొత్త బొగ్గు గనులను తీసుకురావడానికి కృషి చేయవలసిన బాధ్యతలను విస్మరించింది. అందుకు విరుద్ధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద సింగరేణి అధికారులు పడిగాపులు కాస్తున్నారు. ఇది అత్యంత గర్హనీయమైన చర్య. ఇప్పటికైనా సంస్థ భవిష్యత్తును, కార్మికుల మనోభావాలను గమనించి నడుచుకోవాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు..
కార్మికుల హక్కులను కాపాడటం, సాధించడంలో గుర్తింపు సంఘం ఏఐటియూసి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ఘోరంగా విఫలమయ్యాయి. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యాజమాన్యానికి వంత పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి.
డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని టీబీజీకేఎస్ డిమాండ్
1)వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలి
2)కార్మికులకు ఆదాయపుపన్ను ను రద్దు చేయాలి, అలవెన్స్ లపై ఆదాయపన్ను ను యాజమాన్యమే చెల్లించాలి
3)అనారోగ్య సమస్య లతో మెడికల్ బోర్డ్ కి వెళ్లే కార్మికులందరిని అన్ ఫిట్ చేయాలి. 24 నెలల సర్వీస్ కాల పరిమితిని 36 నెలలకు పెంచాలి.
4)వేలం పాట తో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గుగనులు కేటాయించాలి.
5)సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 43 వేల కోట్ల రూపాయల బకాయిలను కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
6)మెడికల్,ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డిపెండెంట్ లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి
7)35 సంవత్సరాల నుండి 40 ఏళ్లకు వయసు పరిమితిని పెంచిన యాజమాన్యం వారిలో 10th క్లాస్ సర్టిఫికేట్ లేని వారిని విజిలెన్స్ కు పంపడాన్ని నిలిపివేసి వారికి వెంటనే
ఉద్యోగాలు ఇవ్వాలి.
8) మారుపేర్లతో పనిచేస్తూ అన్ ఫిట్ అయినా కార్మికుల పిల్లలకు వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి వారిని ఆదుకోవాలి.
9)జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఉత్తర్వులు ఇచ్చిన 50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డు కు పిలిచి వారందరిని అన్ ఫిట్(ఇన్వాలిడేషన్)చేయాలి
10)కొత్త ట్రాన్స్ఫర్ పాలసీ ని రద్దు చేయాలి. ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలి.
ఈ సమస్యల మీద డైరెక్టర్ పా గౌతమ్ పొట్రూ ఐఏఎస్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది
ఈ ధర్నా కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సెంట్రల్ కమిటీ సభ్యులు, బ్రాంచ్ సెక్రటరీలు, బ్రాంచి కమిటీ సభ్యులు, ఫిట్ సెక్రటరీలు, హిట్ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు డిఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
.jpg)
గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్

BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ మద్దతు!
