కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి
సికింద్రాబాద్, సెప్టెంబర్ 03 ( ప్రజామంటలు) :
బీఆర్‌ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై వేటు వేసిన విషయంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బుధవారం బోయిన్‌పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు కొడుకు, కూతురు ముఖ్యం కాదు పార్టీ, తెలంగాణ యే ముఖ్యమైంది అన్నారు. బీఆర్‌ఎస్‌ను ధిక్కరించే వారెవరికైనా ఇదే గతి పడుతుంది అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ప్రతి పార్టీలో ఇలాంటి సస్పెన్షన్లు జరుగుతాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు సహజమని పేర్కొన్నారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని అన్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ కు గొప్ప పేరుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదొవ పట్టిస్తూ డ్రామాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం విషయం లో సీబీఐ గాని మరెవరు కాని ఏమీ చేయలేరన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
-overlay.jpg.jpg)
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
