సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం
(రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494)
.
రాష్ట్రంలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణానికి ప్రత్యేకత ఉంది. గంభీర గౌతమీ (గోదావరి) నది తీరంలో వెలసిన తీర్థంగా, పలు దేవాలయాల సమాహారంతో క్షేత్రంగా, తన ఆస్థాన కవిగా, ఆస్థానానికి వన్నె తెచ్చిన కన్నడ ఆదికవిగా భావింప బడే, విక్రమార్జున చరిత్ర కావ్య కర్త పంప మహా కవి, ఆ కావ్యాన్ని తనకు అంకితం ఇచ్చిన సందర్భంగా,
వేముల వాడ రాజధానిగా పాలించిన చాళుక్య రాజు రెండవ అరి కేసరి ద్వారా దానమీయ బడిన బ్రాహ్మణ అగ్రహారంగా నేపథ్యం కలిగిన నేల ఇది. దేశంలోనే అరుదైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రైమూర్త్య నిలయంగా విరాజిల్లుతోంది. అంతే కాదు...
ఆర్ష విజ్ఞాన సంపత్తికి, సనాతన సంప్రదాయ ఆచరణలకు అనాదిగా పట్టుకొమ్మగా నిలిచి, ధర్మ ప్రచార కేంద్రంగా, సభ్యతా సంస్కృతులకు ఆలవాలంగా ఉన్న ధర్మపురి తన ప్రాచీన వారసత్వ ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూనే ఉంది. అలా ఏటా భాద్రపద శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు లబ్ధ ప్రతిష్ఠులు
పౌరాణికులచే భాగవత పురాణ ప్రవచనాలు జరుగు తుండడం క్షేత్ర వాసుల పురాకృత సుకృత ఫలితమే మరి. ఈ ఏడు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన అంతర్గత శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయంలో, దేవస్థానము, శ్రీ శారదా మహిళా మండలి సంయుక్త నిర్వహణలో శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణికులు, పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ భాగవత పురాణ సప్తాహం కొనసాగిస్తున్నారు.
భాగవత పురాణ శ్రవణం ద్వారా ముక్తి లభ్యం
.............................................
భాగవత పురాణ శ్రవణం ద్వారా కలియుగంలో ముక్తి లభించగలదని, భక్తిశ్రద్ధ లతో భారత ప్రాచీన ఆర్ష విజ్ఞానానికి మూలాధారాలైన పురాణాలను శ్రవణం చేయాలని పౌరాణికులు, పురాణం మహేశ్వర శర్మ ఉద్ఘాటించారు. క్షేత్రంలో శ్రీరామలింగేశ్వరాలయంలో శ్రీశారదా మహిళా మండలి, దేవస్థానం సౌజన్యంతో ఆయన సప్తాహ కార్య క్రమాన్ని ప్రారంభించారు. సనక సనందాదులు నారదునికి తెలిపిన విధానాన్ని, నారద పూర్వజన్మ వృత్తాంతాన్ని, పాండవుల మహా ప్రస్తానాన్ని, పరీక్షిత్తు పూర్వజన్మ నేపథ్యాన్ని సోదాహరణంగా పౌరాణికులు మహేశ్వర శర్మ శ్రవణానందంగా చేసిన ప్రవచనాన్ని క్షేత్ర వాసులు విని తరించారు. అధిక సంఖ్యలో మహిళలు హాజరైనారు. అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, స్థానిక శారదా మహిళా మండలి ఆధ్వర్యంలో దేవస్థానం పక్షాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ అభిషేకం పురోహితులు బొజ్జ రాజగోపాల్, సిబ్బంది శారదా మహిళా మండలి సభ్యులు, స్థానిక మహిళలు దేవస్థానం నుండి మేళతాళాలతో పాలెపు బద్రీనాథ్ శర్మ గారి ఇంటివద్ద ఉన్న బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మను పూలమాల శేష వస్త్రంతొ దేవస్థానం అద్యక్షులు జక్కు రవీందర్ సన్మానించడం జరిగింది.
అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంనకు ఆహ్వానించి, దేవస్థానంలో గల వేదికపై భాగవత గ్రంథానికి పూజచేసి ప్రవచన కార్యక్రమము ప్రారంభించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు
-overlay.jpeg-overlay.png)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు
