తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 26న ‘‘లీడర్’’ శిక్షణ ప్రారంభం
*కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో శిక్షణ తరగతులు
యువత, మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శిక్షణ
హైదరాబాద్ జూలై 24:
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 26న (శనివారం) ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించబోతుందని వెల్లడించారు.. లీడర్ రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ గతనెల 15వ తేదీన ఆవిష్కరించామని.. శిక్షణ తరగతులను శనివారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
జూలై 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో రెండు సెషన్స్ గా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, రాజ్యాంగంలో ఏయే అంశాలను పొందుపరిచారు. ప్రజలకు సేవతో ప్రజలకు చేరువ కావాలంటే నాయకుడు వ్యవహరించాల్సిన తీరు సహా అన్ని రకాల శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లీడర్ శిక్షణ తరగతులకు హాజరవుతారని వెల్లడించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
