కరెంట్ షాక్ మృతులకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా - మంత్రి శ్రీధర్ బాబు
గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వానిదే..
రామంతపూర్ ఘటనపై దర్యాప్తు
నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు
గాంధీ లో మంత్రి శ్రీధర్ బాబు
సికింద్రాబాద్, ఆగస్టు 18 (ప్రజామంటలు):
రామంతపూర్ కరెంట్ షాక్ ఘటనలో ప్రాణాలు కోల్పొయిన మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు రాష్ర్ట మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రకటించారు. సోమవారం మంత్రి గాంధీ ఆసుపత్రికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. గాంధీ మార్చురీ భవనంలోకి వెళ్ళి అక్కడున్న ఐదు మృతదేహాలను చూసి, ఘటన వివరాలను అక్కడున్న పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ...కరెంట్ షాక్ ఘటనలో గాయపడిన వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మరో 100 మీటర్ల దూరంలో శోభయాత్ర ముగుస్తుందనగా, ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు నివేదిక వచ్చాకా ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా కేబుల్ వైర్లు, కరెంట్ తీగలపై స్పెషల్ డ్రైవ్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోవు గణేశ్ నవరాత్రోత్సవాల సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి , డీఎమ్ఈ డా.నరేంద్ర కుమార్,గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జీ పరమేశ్వర్ రెడ్డి ఉన్నారు. పోస్టు మార్గం పూర్తయిన తర్వాత ఐదు డెడ్ బాడీలను ఆసుపత్రి సిబ్బంది మృతుల కుటుంబసభ్యులకు అప్పగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)